Shruti Haasan Married Secretly to Her Boyfriend

Shruti Haasan: ఈ సంవత్సరంలో శృతిహాసన్ చాలామంది డైరెక్టర్లకు, నిర్మాతలకు, హీరోలకు గోల్డెన్ హీరోయిన్ గా మారిపోయింది. ఎందుకంటే ఈమె హీరోయిన్ గా చేసిన ప్రతి ఒక్క సినిమా బ్లాక్ బస్టర్..శృతిహాసన్ నటిస్తే చాలు సినిమా బ్లాక్ బస్టర్ హిట్ అనేలా మారిపోయింది.ఇక ప్రస్తుతం అడివి శేష్ తో కలిసి డెకాయిట్ అనే మూవీలో నటిస్తోంది.

దీనికి సంబంధించిన టీజర్ ఈ మధ్యనే విడుదలై అందర్నీ ఆకర్షించింది. ఇదిలా ఉంటే శృతిహాసన్ ఎవరికీ తెలియకుండా సీక్రెట్ గా శాంతను హాజరికని పెళ్లి చేసుకుందట. దీనికి సంబంధించిన న్యూస్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ గా మారాయి.దాంతో నిజంగానే శృతిహాసన్ పెళ్లి చేసుకుందా అని చాలామంది నెటిజెన్లు ఆరాతీస్తున్నారు. అయితే ఈమె పెళ్లి విషయాన్ని బయట పెట్టింది ఎవరో కాదు సోషల్ మీడియాలో ఇన్ఫ్లుయెన్సర్ ఓరీ.

Also Read: Kalyan Ram: క‌ళ్యాణ్ రామ్ కు హ్యాండిచ్చిన ఎన్టీఆర్‌.. అస‌హ‌నంలో నంద‌మూరి ఫ్యాన్స్‌!?

ఈయన టాప్ సెలబ్రెటీలతో ఉంటూ వారితో పబ్బులు, పార్టీలు అంటూ తిరుగుతూ ఉంటారు. అయితే ఓరి స్వయంగా శృతిహాసన్ పెళ్లి చేసుకుంది అంటూ ఓ ఇంటర్వ్యూలో హింట్ ఇవ్వడంతో ఇదంతా నిజమే అని, శృతిహాసన్ నిజంగానే రహస్యంగా పెళ్లి చేసుకుంది అని అందరూ భావిస్తున్నారు. దాంతో శృతిహాసన్ పెళ్లిగోల సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.ఇక ఏ విషయం పైన అయినా తొందరగా రియాక్ట్ అయ్యే శృతిహాసన్ ఈ పెళ్లి విషయంపై కూడా రియాక్ట్ అయింది.

Shruti Haasan Married Secretly to Her Boyfriend

ఇక ఈ వార్తలపై క్లారిటీ ఇస్తూ.. నేను ఎవరిని పెళ్లి చేసుకోలేదు .. సీక్రెట్ గా పెళ్లి చేసుకున్నాను అంటూ వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదు. వాటిని నమ్మకండి..ఇన్ని విషయాలు మీతో పంచుకునే నేను ఇది మాత్రం ఎందుకు చెప్పానని భావిస్తున్నారు..నా పెళ్లి వార్తల్లో ఎలాంటి నిజం లేదు అంటూ శృతిహాసన్ కొట్టిపారేసింది. శృతిహాసన్ క్లారిటీతో పెళ్లి వార్తలు ఆగిపోయాయి. (Shruti Haasan)

Join WhatsApp