Don’t Trouble the Trouble: Fahad Fazil ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ సంచలనం!!

మలయాళ స్టార్ ఫహాద్ ఫాజిల్ తొలిసారిగా పూర్తి స్థాయి తెలుగు పాత్రలో నటిస్తున్న ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్ విడుదలై సంచలనం సృష్టిస్తోంది. మ్యాజిక్, మిస్టరీ, హారర్ మేళవింపుగా రూపొందిన ఈ టీజర్ ప్రేక్షకుల్లో భారీ అంచనాలు పెంచింది. ఇప్పటికే చివరి దశకు చేరుకున్న ఈ సినిమా సెప్టెంబర్ 11న తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఒకేసారి రిలీజ్ అవుతుంది.

టీజర్లో ఫహాద్ ఒక మెజీషియన్ పాత్రలో కనిపిస్తాడు. ఒక చిన్నారి ముందు వరుసగా మ్యాజిక్ ట్రిక్స్ చేస్తుంటాడు, కానీ ఆమెను మాయం చేయడానికి ప్రయత్నిస్తాడు. అయితే ఆ చిన్నారి ఒక్కసారిగా వింతగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. ఆమెలో ఆత్మ ఆవహించినట్లు విచిత్రమైన శక్తులు ప్రదర్శిస్తూ ఫహాద్‌కే షాక్ ఇస్తుంది. భయపడిన ఫహాద్ అక్కడి నుంచి పారిపోవడానికి ప్రయత్నించినా చిన్నారి అతడిని వెంటాడుతుంది.

చివర్లో వచ్చే విజువల్స్, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ సినిమాపై క్యూరియాసిటీని మరింత పెంచుతున్నాయి. ఈ చిత్రాన్ని శశాంక్ యేలేటి దర్శకత్వంలో ‘బాహుబలి’ నిర్మాత శోభు యార్లగడ్డ, దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి కుమారుడు ఎస్.ఎస్. కార్తికేయ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఫహాద్ ఫాజిల్‌తో పాటు సారా పాలేకర్, సౌరభ్ సచ్‌దేవ్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ హారర్, ఫాంటసీ, థ్రిల్లర్ ఎలిమెంట్స్‌తో వినూత్న కథాంశంగా రూపొందుతోంది. టీజర్ రిలీజ్ అయిన కొద్ది సేపటికే సోషల్ మీడియాలో మంచి రెస్పాన్స్ రావడం ఈ సినిమాపై ప్రేక్షకుల అంచనాలను రెట్టింపు చేసింది. సెప్టెంబర్ 11న రిలీజ్ కోసం ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu