
Fake rs 500 Notes: బాన్సువాడలో దొంగ నోట్ల కలకలం రేపింది. సర్పంచ్ ఎన్నికల్లో 500 రూపాయల దొంగ నోట్లు పంచాడట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. నిజామాబాద్ జిల్లా, వర్ని మండలం, జలాల్ పూర్లో ఈ ఘటన వెలుగులోకి వచ్చినట్లు చెబుతున్నారు. సర్పంచ్ ఎన్నికల్లో జోరుగా దొంగ నోట్లు పంపిణీ చేశాడట కాంగ్రెస్ సర్పంచ్ అభ్యర్థి. Fake rs 500 Notes
Fake rs 500 Notes in Bansuada
ఆ నోట్లతో కెనరా బ్యాంకులో క్రాప్ లోన్ వడ్డీ చెల్లించేందుకు వెళ్లాడట రైతు. అయితే, అవి దొంగ నోట్లుగా గుర్తించి వెంటనే పోలీసులకు సమాచారం ఇయ్యారట బ్యాంక్ అధికారులు. రైతును పట్టుకొని విచారించగా భాగోతం బయట పడింది. Fake rs 500 Notes
Also Read: Congress: బీఆర్ఎస్ సర్పంచులను గెలిపించిన ప్రజలకు బుద్ధుందా, సిగ్గుండాలి ?
అయితే సర్పంచ్ ఎన్నికల్లో సదరు కాంగ్రెస్ అభ్యర్ధి గెలవడం జరిగిందని అంటున్నారు. సదరు అభ్యర్ధి పోచారం శ్రీనివాస్ రెడ్డి అనుచరుడు కావడంతో ఈ విషయం బైటికి పొక్కకుండా జాగ్రత్త పడుతున్నారని సమాచారం అందుతోంది. ఈ సంఘటన ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ అయింది. Fake rs 500 Notes
Also Read: Telangana BJP: బీజేపీలోకి వెళ్ళిన బీఆర్ఎస్ నేతల పరిస్థితి అధ్వాన్నం..డిజాపాట్లు గల్లంతు ?





