
Telangana: తెలంగాణ రాష్ట్ర రైతన్నలకు ఊహించని షాక్ తగిలింది. వ్యవసాయ మోటార్లకు మీటర్లు ? పెట్టేందుకు సిద్ధం అవుతున్నారట. కొత్త డిస్కం పరిధిలోని వ్యవసాయ మోటార్లకు స్మార్ట్ మీటర్లు పెట్టేందుకు రేవంత్ సర్కారు సిద్ధం అవుతోందట. మోటార్లకు మీటర్లు పెడితే కేంద్రం నుంచి ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితిపై అదనంగా 0.5% రుణాలు తీసుకునేందుకు రంగం సిద్ధం చేస్తున్నారట. Telangana
Telangana Meters for agricultural motors
కేంద్ర బీజేపీ ప్రభుత్వం మోటార్లకు మీటర్లు పెట్టాలని చేస్తున్న ప్రయత్నాలకు రేవంత్ మద్దతు ఇచ్చినట్లు చెబుతున్నారు. గత ఏడాది జులైలోనే మోటార్లకు మీటర్లు పెడతామని అసెంబ్లీ సాక్షిగా ప్రకటించారట రేవంత్ రెడ్డి. తీవ్ర నష్టాల్లో ఉన్న డిస్కంలను కాపాడటానికి కొత్త డిస్కంను ఏర్పాటు చేయనుందట ప్రభుత్వం. సబ్సిడీ, ఉచిత కనెక్షన్ల వినియోగాన్ని అంచన వేసి, రీయింబర్స్‌మెంట్ పద్దతిలో చెల్లింపులు చేయన్నారట. ప్రస్తుతమున్న డిస్కంల నుంచి 29 లక్షల సాగు కనెక్షన్లు, ప్రభుత్వ కనెక్షన్ల బదిలీకి నిర్ణయం తీసుకున్నట్లు చెబుతున్నారు. Telangana
Also Read: Jagan: మెడికల్ కాలేజీలను తీసుకున్న వారు జైలుకే…జగన్ మాస్ వార్నింగ్ ?
రూ. 35 వేల కోట్ల అప్పులు కొత్త డిస్కంకు బదిలీ, గృహలక్ష్మి కనెక్షన్లపై కొనసాగుతున్న అనిశ్ఛితి నెలకొంది. కొత్త డిస్కం ఏర్పాటుకు రేవంత్ ప్రభుత్వం ఆమోదం..లైసెన్స్ కోసం టీజీఈఆర్‌సీలో దరఖాస్తు చేసినట్లు చెబుతున్నారు. ఈ మేరకు బీఆర్ ఎస్ పార్టీ సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. Telangana
Also Read: Tirumala: తెరపైకి మరో వివాదం…తిరుమలలో రాజకీయ పోస్టర్ కలకలం





