షూటింగ్స్ చేయొద్దంటూ ఛాంబర్ ఆదేశాలు

సినీ కార్మికుల సమ్మె నేపథ్యంలో తెలుగు ఫిల్మ్ ఛాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ సంచలన ప్రకటన చేసింది. ఇకపై ఎలాంటి షూటింగ్స్‌ జరపకూడదని నిర్మాతలకు సూచన చేసింది. ఫిలిం ఫెడరేషన్ నాయకులతో కూడా ఎవరూ సంప్రదింపులు చేయొద్దని, తదుపరి నిర్ణయం తీసుకునేవరకు వేచి చూడాలని ఫిలింఛాంబర్ పేర్కొంది.

ఫిలిం ఫెడరేషన్ కు చెందిన 24 క్రాఫ్ట్‌ నేతలు తమను సంప్రదించకుండానే ఏకపక్షంగా బంద్‌కు పిలుపునిచ్చిన నేపథ్యంలో తాము ఇలాంటి నిర్ణయం తీసుకున్నట్లు ఫిలింఛాంబర్ ప్రకటనలో తెలిపింది. ప్రొడ్యూసర్స్ తమతో చేసుకున్న ముందస్తు ఒప్పందం మేరకు 30 శాతం వేతనాలు పెంచాలని సినీ కార్మికులు డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు లేబర్ కమిషన్ కూడా ఈ సమ్మె విషయంలో దర్యాప్తు మొదలుపెట్టింది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu