IPL 2025: SRH కు వెన్నుపోటు పొడుస్తున్న సొంత ప్లేయర్లు?
IPL 2025: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు అత్యంత దారుణమైన ప్రదర్శన కనబరుస్తోంది. మొదటి మ్యాచ్ లో రాజస్థాన్ రాయల్స్ జట్టును చిత్తుచిత్తు చేసింది సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు. కానీ ఆ తర్వాత ఏమైందో తెలియదు గానీ… వరుసగా ఓటములను చవిచూస్తోంది హైదరాబాద్. ఇప్పటివరకు ఈ టోర్నమెంట్లో… ఐదు మ్యాచ్లు ఆడింది సన్రైజర్స్ హైదరాబాద్.

Former SRH Boys Siraj and Sundar Sink Hyderabad
ఇందులో మొదటి మ్యాచ్ విజయం సాధించిన హైదరాబాద్ వరుసగా నాలుగు మ్యాచ్లో ఓడిపోయింది. దీంతో పాయింట్స్ టేబుల్ లో కూడా పదవ స్థానంలో నిలిచింది హైదరాబాద్. ఇది ఇలా ఉండగా గుజరాత్ టైటాన్స్ వర్సెస్ సన్రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య తాజాగా కీలక మ్యాచ్ జరిగింది. ఈ మ్యాచ్లో సిరాజ్ అలాగే… వాషింగ్టన్ సుందర్ కారణంగా హైదరాబాద్ ఓడిపోయింది.
Ravi Teja: ఛీ ఛీ ఆయనకు నేను తల్లినేంటి అంటూ రవితేజ మూవీ రిజెక్ట్ చేసిన హీరోయిన్.?
ఈ ఇద్దరు ప్లేయర్లు కూడా గతంలో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టు తరఫున ఆడిన వారే. అప్పుడు హైదరాబాదులో ఉన్నప్పుడు సరిగ్గా ఆడని ఈ ఇద్దరు ప్లేయర్లు.. గుజరాత్ తరఫున మాత్రం అద్భుతంగా ఆడారు. దీంతో సొంత వాళ్లే హైదరాబాద్ జట్టుకు వెన్నుపోటు పొడుస్తున్నారని సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.
Pooja Hegde: పూజ హెగ్డేపై పగబట్టిన తెలుగు హీరో.. సినిమా ఛాన్స్ లు రాకుండా ఆపుతూ.?