Hari Rama Jogaiah: చంద్రబాబు, పవన్ పరువు తీసిన లేఖ ?
Hari Rama Jogaiah: ఏపీ సర్కార్ రు మరో షాక్ ఇచ్చారు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య. గతంలో జగన్ మోహన్ రెడ్డిని లేఖలతో ప్రశ్నించిన మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య.. ఇప్పుడు కూడా తన లేఖలతో.. చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ తో చుక్కలు చూపిస్తున్నాడు. ఇప్పటికే..చంద్రబాబు నాయుడు కూటమి సర్కార్ పై విరుచుకుపడుతూ… చాలా లేఖలు రాశాడు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య.

Hari Rama Jogaiah letter to chandrababu and pawan kalyan
ఇక తాజాగా మరోసారి మఖ్య మంత్రివర్యులు చంద్రబాబు నాయుడు అలాగే…. ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ లకు బహిరంగ లేఖ అంటూ మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య లేఖ విడుదల చేశారు. కృష్ణ గుంటూరు జిల్లాల్లో రాజధాని పేరుతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికే సుమారు 50 వేల కోట్లను ఖర్చు చేశారని లేఖలో పేర్కొన్నారు. మరో 50 వేల కోట్లు ఖర్చు చేయడనికి కూడా సిద్ధం అవుతున్నారని తెలిపారు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య. పరిపాలన సౌలభ్యం కోసం ఆఫీసులు శాసనసభ శాసనమండలి హైకోర్టు వంటి వాటికోసం ఖర్చు చేయడం మంచిదే అని తెలిపారు.
Also Read: Pawan Kalyan: ఈ 11 ఏళ్ల వేడుకలు వైసీపీ 11కి అంకితం ?
ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ వారాహి సభలో ఉభయ గోదావరి జిల్లాలను దత్తత తీసుకుంటూనన్నారన్నారు. మరి గోదావరి జిల్లాల అభివృద్ధికి ఏ విధమైన సౌకర్యాలు కల్పించారు చెప్పాల్సిన అవసరం ఉందని వెల్లడించారు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య.. విద్య వైద్యం రోడ్లు రవాణా వ్యాపార వ్యవసాయ సాగునీరు తాగునీరు పరిశ్రమలు ఓడరేవులు వంటి అభివృద్ధి కార్యక్రమాలకు ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉందన్నారు. ఏళ్ల తరబడి సమగ్ర అభివృద్ధికి నోచుకోని గోదావరి జిల్లాలకు కూటమి ప్రభుత్వం సంవత్సర కాలంలో ఏ అభివృద్ధి పథకాలకు ఎంత ఖర్చు చేశారో వైట్ పేపర్ ఇవ్వాలని కోరారు. సంవత్సరానికి ఒకసారి ప్రతి జిల్లాకు చేసిన ఖర్చుపై వైట్ పేపర్ రిలీజ్ చేస్తే ప్రజలు సంతోషిస్తారన్నారు మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య.
Also Read: Komatireddy: నాకు మంత్రి పదవి ఇవ్వకపోతే కాంగ్రెస్ కే నష్టం?