Sobhita: శోభిత గోరింటాకుకి వేణు స్వామికి మధ్య లింక్.. అదే నిజం కాబోతుందా.?
Sobhita: శోభిత ధూళిపాళ్ల చేతికి పెట్టుకున్న గోరింటాకుకి,ప్రముఖ ఆస్ట్రాలజర్ వేణు స్వామికి మధ్య ఉన్న లింక్ ఏంటి అని చాలామంది జుట్టు పీక్కుంటున్నారు. మరి శోభిత గోరింటాకు కి వేణు స్వామికి మధ్య ఉన్న లింక్ ఏంటో ఇప్పుడు చూద్దాం.. డిసెంబర్ 4న శోభిత నాగచైతన ల పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది.పెళ్లి తర్వాత వీళ్ళు శ్రీశైలం మల్లికార్జున స్వామిని దర్శనం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.
he link between Sobhita mehandi and Venu Swamy
అయితే పెళ్లి సమయంలో శోభిత రెండు అందమైన చీరలు కట్టుకొని అచ్చ తెలుగు అమ్మాయిలా నగలు వేసుకొని కనిపించింది. అయితే పెళ్లికూతురు గా రెడీ అయిన తర్వాత శోభిత ధూళిపాళ్ల అల్లు అర్జున్ నటించిన బ్లాక్ బస్టర్ బ్లాక్ బస్టరే అనే సాంగ్ కి డ్యాన్స్ చేసింది.అయితే ఈ డ్యాన్స్ లో శోభిత దూలిపాళ్ల చేతికి ఉన్న గోరింటాకు కనిపించింది. (Sobhita)
అయితే ఆమె చేతికి ఉన్న గోరింటాకుకి వేణు స్వామి మాటలను ట్యాగ్ చేస్తూ సోషల్ మీడియాలో కొంతమంది ఓ వీడియో వైరల్ చేస్తున్నారు.ఇక అసలు విషయం ఏమిటంటే..శోభిత ధూళిపాళ్ల తన చేతికి పెట్టుకున్న గోరింటాకు అంతగా పండలేదు. దాంతో శోభితా గోరింటాకు ఎర్రబడలేదు కాబట్టి చైతు శోభితల పెళ్లిలో వేణు స్వామి చెప్పింది నిజమవుతుంది.వీరి పెళ్ళి కొద్దిరోజులే నిలుస్తుంది.
ఆ తర్వాత వేణు స్వామి చెప్పినట్లే విడాకులు తీసుకుంటారు అంటూ ఓ వీడియో వైరల్ చేస్తున్నారు.అయితే అమ్మాయి చేతికి పెట్టుకున్న గోరింటాకు ఎంత ఎర్రబడితే అంత మంచి మొగుడు వస్తారు అంటారు. కానీ శోభిత పెట్టుకున్న గోరింటాకు ఎర్ర పడకపోవడంతో నాగచైతన్య మంచివాడు కాదని, వీరి పెళ్లి విషయంలో వేణు స్వామి చెప్పింది నిజమవుతుంది అంటూ ఓ వీడియో వైరల్ అవుతుంది.(Sobhita)
https://www.instagram.com/reel/DDegIvXooES/?utm_source=ig_web_copy_link