Garlic: వెల్లుల్లి రోజుకు రెండు ముక్కలు తింటే.. 100 రోగాలకు చెక్ ?
Garlic: వెల్లుల్లి ఇది ప్రతికూరలో తప్పకుండా వాడతారు. వెల్లుల్లి ఘాటుగా ఉండడమే కాకుండా సువాసనను వెదజిల్లుతుంది. వెల్లుల్లి తినడం వల్ల బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. వెల్లుల్లిలో విటమిన్ సి, ఫైబర్, బి 6 అధికంగా ఉంటాయి. ఇది శరీరానికి చాలా మంచిది. వెల్లుల్లిలో శక్తివంతమైన ఆంటీ యాక్సిడెంట్లు ఉంటాయి. ఈ పోషకాలు ఆరోగ్యానికి ఎంతో మేలును కలిగిస్తాయి. వెల్లుల్లి జీర్ణ క్రియలో సహాయం చేస్తుంది. పేగుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
కొలెస్ట్రాల్ ను తొలగించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటుంది. రక్తపోటు సమస్యలను అదుపులో ఉంచుతుంది. బరువు నియంత్రణలో వెల్లుల్లి ప్రముఖ పాత్ర పోషిస్తుంది. వెల్లుల్లిని కూరగాయలు మొదలైన వంటకాలలో మసాలాగా ఉపయోగిస్తారు. చట్నీకి కూడా వాడుతారు. అయితే వెల్లుల్లి ఖాళీ కడుపుతో రెండు రెబ్బలు నమలి తిన్నట్లయితే ఎన్నో రకాల వ్యాధులు తొలగిపోతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు.
వెల్లుల్లిలో పోషకాలు సమృద్ధిగా ఉండడమే కాకుండా వేడెక్కించే స్వభావం ఉంటాయి. అందుకే శీతాకాలంలో ప్రతిరోజు ఉదయం వెల్లుల్లి రెబ్బలు తినడం వల్ల శరీరం లోపల వెచ్చగా ఉంటుంది. వెల్లుల్లి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. జలుబు, దగ్గు, ఇన్ఫెక్షన్ల సమస్యలను తొలగిస్తుంది. కీళ్లు, కండరాల నొప్పి సమస్య ఎక్కువగా ఉన్న వారు వెల్లుల్లిని తప్పకుండా ఉదయం పూట తినాలి. వెల్లుల్లిలో యాంటీ ఆక్సిడెంట్లు ఆక్సీకరణ ఒత్తిడితో పోరాడడానికి సహాయపడతాయి. ఉదయాన్నే రెండు వెల్లుల్లి రెబ్బలు నమిలి తిన్నట్లయితే గుండె, మెదడు రెండింటికీ మేలు కలుగుతుంది.