Curry leaves: కరివేపాకు తింటే ఏం జరుగుతుంది.. ఉపయోగాలు ఇవే ?
Curry leaves: కరివేపాకు అన్ని రకాల వంటకాలలో వాడుతూ ఉంటారు. కరివేపాకు తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ఉండే ఫైబర్ శరీరంలో పెరిగే కొవ్వును తొలగిస్తుంది. కరివేపాకును ప్రతి రోజు ఆహారంలో వేసుకుని తిన్నట్లయితే శరీరానికి కావాల్సిన ప్రోటీన్లు, విటమిన్లు అధికంగా అందుతాయి. కరివేపాకును జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకున్నట్లయితే చాలా మంచిది. దీనిని డైట్ ఫాలో అయ్యేవారు తప్పకుండా తాగుతూ ఉంటారు. రెండు రోజులకి ఒకసారి అయినా కరివేపాకు జ్యూస్ తాగినట్లయితే శరీరంలో పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. కరివేపాకు పొడి కూడా చాలా మంది తింటూ ఉంటారు.

Health Benefits With Curry leaves
కరివేపాకు పొడి రుచి చాలా బాగుంటుంది. ఇందులో ఉండే రసాయనాలు, ప్రోటీన్లు ఎంతో రుచిని ఇస్తాయి. కరివేపాకును పచ్చడి రూపంలో కూడా తయారు చేసుకుని తిన్నట్లయితే చాలా మంచిది. ఇది ఆకలిని పెంచడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. శరీరంలో రక్తం పెంచడానికి కీలకపాత్ర పోషిస్తుంది. రక్తం పెంచడానికి చెడు రక్తాన్ని తొలగించడానికి కీలక పాత్ర పోషిస్తుంది. కరివేపాకును తిన్నట్లయితే గుండె చుట్టూ పేరుకుపోయిన కొవ్వు తొలగిపోతుంది. ఇది గుండె వేగాన్ని పెంచుతుంది. కరివేపాకు శరీరంలో క్యాన్సర్ కణాలను పెరగకుండా ఎంతగానో సహాయం చేస్తుంది. చిన్నపిల్లలకు కూడా కరివేపాకును పచ్చడి రూపంలో తయారు చేసే తినిపించినట్లయితే వారు చాలా యాక్టివ్ గా ఉంటారు. ఇది మెదడు పనితీరును పెంచడానికి కీలక పాత్ర పోషిస్తుంది.
చిన్న పిల్లల్లో ఆకలి పెరుగుతుంది. ఇది ఆకలిని పెంచడానికి ముఖ్య పాత్ర పోషిస్తుందని చెప్పవచ్చు. కరివేపాకు డయాబెటిస్ పేషంట్లకు కూడా చాలా మంచిది. డయాబెటిస్ పేషెంట్లు ప్రతిరోజు కరివేపాకుని తిన్నట్లయితే వారికి రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. ఇది రక్తంలో ఉండే చక్కెరను తొలగించడానికి ఎంతగానో సహాయం చేస్తుంది. కరివేపాకు పొడి డయాబెటిస్ పేషెంట్లకు చక్కటి వరం అని చెప్పవచ్చు. షుగర్ పేషెంట్లు చపాతీలో కరివేపాకు పొడిని పెట్టుకుని తిన్నట్లయితే మరింత మంచిది. ఈ రెండు కూడా మంచి పోషకాహారం. ఈ రెండు కలిపి తిన్నట్లయితే వారికి అనేక రకాల వ్యాధులు తొలిగిపోతాయి. షుగర్ పేషెంట్లు ప్రతిరోజూ కరివేపాకు పొడి కానీ పచ్చడి కానీ తిన్నట్లయితే చాలా మంచిది.