Salmon Fish: సాల్మన్ చేపలు తింటున్నారా.. అయితే ఇవి తెలుసుకోండి ?
Salmon Fish: సాల్మన్ చేపలు మహిళలకు ఏర్పడే అనేక ఆరోగ్య సమస్యలను తొలగిస్తాయి. చేపల్లో అధికంగా ఉండే ఒమేగా-3, విటమిన్లు, ప్రోటీన్, ఫ్యాటీ ఆమ్లాలు ఆరోగ్యానికి మేలును కలిగిస్తాయి. సాల్మన్ లో ఉన్న ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు గర్భిణీ స్త్రీలకు చాలా మంచిది. ఇది శిశువు యొక్క మెదడు, నాడి వ్యవస్థ అభివృద్ధికి ఎంతగానో తోడ్పడుతోంది. గర్భస్థ శిశువు మెదడు ఎదుగుదలకు పనిచేస్తోంది. సాల్మన్ చేపలు తినడం ద్వారా మహిళలలో హృదయ సంబంధ సమస్యలను తగ్గించవచ్చు. Salmon Fish
Health Benefits With Salmon Fish
ఒమేగా-3, ఫ్యాటి ఆమ్లాలు కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించడానికి సహాయపడతాయి. సాల్మన్ లో విటమిన్ డి అధికంగా ఉండడం వల్ల ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఇది శరీరానికి అవసరమైన కాలుష్యాన్ని అందించడానికి సహాయం చేస్తాయి. సాల్మన్ చేపలలో ఒమేగా-3, ఫ్యాటి ఆమ్లాలు శరీరంలో ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయం చేస్తాయి. దీనివల్ల శరీరంలో ఏర్పడే ఆర్థరైటిస్ వంటి వ్యాధులు తొలగిపోతాయి. Salmon Fish
Also Read: KTR: ఫార్ములా ఈ రేసు కేసులో కేటీఆర్ భారీ ఊరట?
ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు మరియు బి 12, విటమిన్లు మెదడు ఆరోగ్యానికి చాలా కీలకం. ఇవి మెమొరీ పవర్ పెరగడానికి అలాగే నిరాశ, ఆందోళన వంటి మానసిక సమస్యలను నివారిస్తాయి. సాల్మన్ చేపలలో ఉండే పోషకాలు ముఖ్యంగా ఫ్యాట్స్, విటమిన్ ఇ, ఒమేగా-3, ఫ్యాటీ ఆమ్లాలు చర్మ ఆరోగ్యానికి కాపాడతాయి. చర్మ సమస్యలను తగ్గించి వృద్ధాప్యాన్ని దూరం చేస్తాయి. సాల్మన్ లో తక్కువ కార్బోహైడ్రేట్, ఫ్యాట్ కంటెంట్, అధిక ప్రోటీన్ కారణంగా కీటోడైట్ తీసుకునే మహిళలకు చాలా మంచిది. ఇది బరువు తగ్గడంలో సహాయపడుతుంది. శరీరానికి అవసరమైన ప్రోటీన్లను అందిస్తుంది. Salmon Fish