స్టైల్, ఫ్యాషన్ లో హీరోయిన్ మాళవిక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ట్రెండీ వేర్, స్టైలింగ్ తో సోషల్ మీడియాలో మాళవిక సెన్సేషన్ అవుతుంటుంది. ఈ స్టైలింగ్ ఆమెకు శక్తి అవార్డ్ అందించింది. ఢిల్లీలో జరిగిన వీ వుమెన్ వాంట్ కాన్ క్లేక్ లో మాళవికకు శక్తి అవార్డ్ సొంతం చేసుకుంది. కాంగ్రెస్ నేత శశి థరూర్ ఆమెకు అవార్డ్ ప్రదానం చేశారు.
ఈ సందర్భంగా మాళవిక మోహనన్ సోషల్ మీడియా ద్వారా తన హ్యాపీనెస్ షేర్ చేసుకున్నారు. శక్తి అవార్డ్ తీసుకోవడం ఎంతో గౌరవంగా భావిస్తున్నట్లు ఆమె తెలిపారు. స్టైలింగ్ విషయంలో ప్రెజర్ ఉంటుందని, వారినికి సరిపోయే దుస్తులను సెలెక్ట్ చేసుకుంటానని, మూడ్ కు తగినట్లు రెడీ అవుతానని ఈ సందర్భంగా తెలిపింది మాళవిక మోహనన్. ఆమె ప్రస్తుతం తెలుగులో ప్రభాస్ సరసన రాజా సాబ్ చిత్రంలో నటిస్తోంది.


The Raja Saab: “తప్పుచేసి నన్నే బెదిరిస్తున్నాడు”.. ది రాజా సాబ్ మూవీపై నిర్మాత సంచలన కామెంట్స్.?