Honda ZR-V: 22.79kmpl హైబ్రిడ్ SUV వచ్చే వారం విడుదల

హోండా ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్. ఎప్పటినుంచో ఎదురుచూస్తున్న హోండా ZR-V హైబ్రిడ్ SUV ఫైనల్‌గా ఇండియన్ మార్కెట్‌లో అడుగుపెట్టడానికి రెడీ అయింది. అవును, కంపెనీ తమ మొట్టమొదటి స్ట్రాంగ్ హైబ్రిడ్ ఎస్‌యూవీని వచ్చే వారం అంటే జులై 20 లేదా 21, 2026 తేదీల్లో లాంచ్ చేయనుంది. ఈ కారును నేరుగా జపాన్ నుంచి పూర్తిగా తయారైన యూనిట్‌గా (CBU) దిగుమతి చేసుకుంటున్నారు, అంటే పరిమిత సంఖ్యలో మాత్రమే ఇది అందుబాటులో ఉంటుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ మోడల్ బుకింగ్‌స్ దేశవ్యాప్తంగా డీలర్‌షిప్‌ల దగ్గర స్టార్ట్ అయ్యాయి.

Honda ZR-V Hybrid SUV Launch

పవర్ట్రెయిన్ విషయానికొస్తే, ఈ SUV లో 2.0-లీటర్ పెట్రోల్ ఇంజన్‌తో పాటు డ్యూయల్ మోటార్‌లు ఉండే అడ్వాన్స్‌డ్ హైబ్రిడ్ సెటప్ ఇచ్చారు. ఇది e-CVT ఆటోమేటిక్ గేర్‌బాక్స్ ద్వారా ముందు చక్రాలకు మాత్రమే పవర్ పంపిస్తుంది. మొత్తంగా ఈ సిస్టమ్ 184bhp పవర్‌తో పాటు ఏకంగా 315Nm టార్క్‌ను జనరేట్ చేస్తుంది. పెర్ఫార్మెన్స్ లెక్కల్లో చూస్తే ఇది 8 సెకన్లలోనే జీరో నుంచి 100 కిలోమీటర్ల స్పీడ్‌ను అందుకుంటుంది. టాప్ స్పీడ్ 172 kmph కాగా, లీటర్‌కు 22.79 కిలోమీటర్ల మైలేజ్ ఇస్తామని హోండా చెప్తోంది. సిటీ డ్రైవింగ్‌లో ఈ ఫ్యూయల్ ఎఫిషియెన్సీ ఇంకా బెటర్‌గా ఉండొచ్చు.

ఇక లోపలి ఫీచర్ల జోలికి వెళ్తే, కొత్త ZR-V డ్యూయల్ స్క్రీన్ సెటప్‌తో చాలా మోడ్రన్ ఫీల్ ఇస్తుంది. ఇందులో వైర్‌లెస్ ఆండ్రాయిడ్ ఆటో మరియు ఆపిల్ కార్‌ప్లే సపోర్ట్ చేసే 9-అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్ ఉంది. దాని పక్కనే డ్రైవర్‌కు కావాల్సిన ఇన్ఫర్మేషన్ చూపించే 10.25-అంగుళాల డిజిటల్ డిస్ప్లే కూడా ఇచ్చారు. ప్రీమియం ఎక్స్పీరియెన్స్ కోసం 12 స్పీకర్ల బోస్ సౌండ్, వైర్‌లెస్ ఛార్జింగ్ ప్యాడ్, డ్యూయల్-జోన్ ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ మరియు లెథెరెట్ అప్‌హోల్స్టరీతో 8-వే పవర్డ్ సీట్లు ఉన్నాయి. అయితే మన దగ్గర బాగా పాపులర్ అయిన సన్‌రూఫ్, వెంటిలేటెడ్ సీట్లు ఇవ్వకపోవడం కాస్త నిరాశ కలిగించే point.

సేఫ్టీ విషయంలో హోండా ఎప్పటిలాగే టాప్ క్లాస్‌లో ఉంది. ఈ కారులో 8 ఎయిర్‌బ్యాగ్‌లు, టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్ మరియు 360-డిగ్రీ కెమెరాతో పాటు లెవల్ 2 ADAS టెక్నాలజీ కూడా స్టాండర్డ్‌గా వస్తోంది. డైమెన్షన్స్ చూస్తే, ఇది 4,567mm పొడవు, 1,840mm వెడల్పుతో రోడ్‌మీద భారీ ప్రెజెన్స్‌ను చూపిస్తుంది. అంతేకాకుండా 1,313 లీటర్ల వరకు బూట్ స్పేస్ కల్పించడం ఫ్యామిలీ కారు కోసం చూసే వాళ్లకు పెద్ద ప్లస్ పాయింట్. మార్కెట్‌లో దీని ధర రూ. 40 లక్షల నుంచి 50 లక్షల మధ్య ఉండొచ్చు, ఇది డైరెక్ట్‌గా ఫోక్స్‌వ్యాగన్ టిగువాన్, స్కోడా కొడియాక్ లాంటి పెద్ద SUV లతో పోటీ పడుతుంది. కలర్ ఆప్షన్లలో ప్లాటినం వైట్, మెటోరాయిడ్ గ్రే లాంటి నాలుగు షేడ్స్ ఉన్నాయి.

Share your love