Jaggery – Cloves: బెల్లం, లవంగాలు కలిపి తింటే.. 100 రోగాలకు చెక్ ?

Jaggery – Cloves: లవంగాలు ఆరోగ్యానికి చాలా మంచిది. ప్రతి రోజు ఆహారంలో లవంగాలను భాగం చేసుకున్నట్లయితే మధుమేహం, పంటి నొప్పి, క్యాన్సర్ వంటి సమస్యలు తొలైపోతాయని పలు అధ్యయనాల్లో వెళ్లడైంది. వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ గుణాలు అధికంగా ఉంటాయి. దానివల్ల ఫ్రీ రాడికల్స్ తో పోరాడి బరువును తగ్గిస్తాయి. వీటిలో ఎలాజిక్ ఆమ్లాలు క్యాన్సర్ కణాలను వృద్ధి చెందకుండా కాపాడుతాయి. Jaggery – Cloves

If ginger and cloves are eaten together

అయితే లవంగాలు రుచికి చాలా ఘాటుగా ఉంటాయి. వీటిని నేరుగా తినలేము. కాబట్టి లవంగాలను కొంచెం బెల్లంతో కలిపి తీసుకున్నట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిదని వైద్య నిపుణులు చెబుతున్నారు. బెల్లం, లవంగాలను కలిపి తినడం వల్ల శరీరానికి కావాల్సిన విటమిన్లు, పొటాషియం, ఐరన్, కాల్షియం, మెగ్నీషియం, ఫైబర్, ఫాస్పరస్, యాంటీఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు అధికంగా ఉంటాయి. బెల్లం, లవంగాలు రెండింటిలో పోషకాలు అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తినడం వల్ల జీర్ణ వ్యవస్థ బలోపేతం అవుతుంది. Jaggery – Cloves

Also Read: Janasena: జగన్ కు మరో ఎదురు దెబ్బ… జనసేనలోకి కీలక నేత… మరో 10 మంది కూడా ?

ఈ రెండింటిని కలిపి తిన్నట్లయితే గ్యాస్, అజీర్ణం, ఆసిడిటీ సమస్యలు నయం అవుతాయి. లవంగాలలో యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉంటాయి. ఇవి గొంతు నొప్పి, దగ్గు, జలుబు సమస్యల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. అంతేకాకుండా గొంతులో శ్లేష్మం తొలగిపోతుంది. బెల్లం, లవంగాలలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. వీటిని కలిపి తిన్నట్లయితే రోగనిరోధక వ్యవస్థ బలపడుతుంది. ఈ కారణాలు ఇన్ఫెక్షన్లతో పోరాడడంలో సహాయపడతాయి. బెల్లం, లవంగాలు తీసుకోవడం వల్ల శ్వాసకోశనానాలు శుభ్రపడతాయి. ఉబ్బసం, అజీర్ణం వంటి సమస్యలు తొలగిపోతాయి. శ్వాస కోస సమస్యల నుంచి ఉపశమనం కలిగించి చలికాలంలో శరీరం వెచ్చగా ఉండేందుకు ఎంతో సహాయం చేస్తాయి. Jaggery – Cloves

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *