Betel Leaves: ఎండాకాలంలో తమలపాకులతో ఇలా చేస్తే.. 100 రోగాలు ఔట్ ?
Betel Leaves: తమలపాకులను ప్రతి ఒక్కరూ ఎంతో ఇష్టంగా భావిస్తారు. ముఖ్యంగా తమలపాకులను పూజా కార్యక్రమాలలో వాయనం ఇవ్వడానికి తప్పకుండా వాడుతూ ఉంటారు. తమలపాకులకు కొన్ని రకాల అనారోగ్య సమస్యలను తొలగించే సామర్థ్యం కూడా ఉంది. తమలపాకుని లవంగం, యాలకులతో కలిపి తినడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో విటమిన్స్, కాల్షియం, ఐరన్, ఫాస్పరస్, ఫైబర్, మెగ్నీషియం, యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. తమలపాకు, లవంగం, యాలకులు ఈ మూడింటిలో పోషకాలు ఎక్కువగా ఉంటాయి. ఈ మూడు కలిపి తినడం వల్ల శరీరానికి ఎన్నో రకాల ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి.

If you do this with betel leaves in the summer, 100 diseases will be eliminated
తమలపాకు, లవంగం, యాలకులు ఈ మూడు జీర్ణ వ్యవస్థను మెరుగు పరుస్తాయి. ఈ మూడు కలిపి తినడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది. జీవక్రియ మెరుగుపడుతుంది. జీర్ణ సమస్యలు తొలగిపోతాయి. గ్యాస్, అల్సర్, అసిడిటీ లాంటి సమస్యలు ఉన్నవారికి ఇది చక్కని మందు. ఈ మూడు కలిపి తినడం వల్ల చక్కని సువాసన వస్తుంది. ఈ మూడు కలిపి తినడం వల్ల నోరు తాజాగా సువాసనతో వెదజల్లుతుంది. నోటి బ్యాక్టీరియాను చంపుతుంది. దుర్వాసనను తరిమికొడుతుంది. తమలపాకులు, యాలకులు, లవంగాలు ఈ మూడింటిలో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఫంగల్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి.
ఇవి శరీరంలోని రోగనిరోధక శక్తిని పెంచుతాయి. శరీరాన్ని ఇన్ఫెక్షన్ల నుంచి శరీరాన్ని కాపాడుతాయి. లవంగాలలో యూజినాల్ అనే మూలకం ఉంటుంది. ఇది సహజ నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. తమలపాకు, లవంగం, యాలకులు ఈ మూడింటిని కలిపి తినడం వల్ల తలనొప్పి, మైగ్రేన్ లాంటి సమస్యలు తొలగిపోతాయి. పంటి నొప్పి సమస్యలు దరి చేరవు. ఈ మూడు కలిపి తినడం వల్ల మానసిక స్థితి మెరుగు పడుతుంది. మానసిక ప్రశాంతత, ఒత్తిడి లాంటి సమస్యలు పోతాయి. తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టుకున్నట్లయితే చాలా మంచిది. ప్రతి ఒక్కరు ఈ చెట్టుని దైవంగా భావిస్తారు. తమలపాకు చెట్టుని ఇంట్లో పెట్టినట్లయితే మానసిక ప్రశాంతత ఉంటుంది.