Sesame Seeds: చలికాలంలో నువ్వులు తింటే 100 రోగాలకు చెక్ ?
Sesame Seeds: చలికాలంలో నువ్వులు తినడం వల్ల ఆరోగ్యానికి ఎన్నో లాభాలు ఉంటాయి. వీటిలో ఐరన్ తో పాటు ఒమేగా, ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉంటాయి. వీటిలోని యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్ల నొప్పులను తొలగిస్తాయి. నువ్వులలో ఫైబర్, ప్రోటీన్లు, కొవ్వు అధికంగా ఉంటాయి. అలాగే నువ్వులు కాల్షియం, ఐరన్ లోపాలను కూడా తగ్గిస్తాయి. దీనిలోని ఫైబర్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది. నువ్వులను ఎక్కువగా తిన్నట్లయితే కఫం సమస్యలు తొలగిపోతాయి.
If you eat sesame in winter, check for 100 diseases
వీటిని రోజు ఎక్కువగా తింటే స్త్రీలలో వచ్చే పీరియడ్స్ సమస్యలు తొలగిపోతాయి. నువ్వులని ఎక్కువగా తిన్నట్లయితే శరీరానికి వేడి చేస్తుంది. నువ్వులకు వేడి చేసే గుణం అధికంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు నువ్వులు ఎక్కువగా తినకూడదని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. అలాగే వేడి శరీరతత్వం కలిగిన వారు కూడా ఉంటారు. చలికాలం నువ్వుల లడ్డూలను బాగా తింటూ ఉంటారు. కానీ వీటిని ఎక్కువగా తింటే రక్తంలో చక్కెర స్థాయిలు అధికంగా పెరుగుతాయి.
అందుకే డయాబెటిస్ పేషంట్లు నువ్వులు ఎక్కువగా తినకూడదు. నువ్వులను ఎక్కువగా తింటే థైరాయిడ్ గ్రంధిపై ప్రభావం పడుతుంది. దీంతో థైరాయిడ్ హార్మోన్ల ఉత్పత్తి తగ్గుతుంది. నువ్వులకు అలర్జీ చేసే స్వభావం ఉంటుంది. అందుకే వీటిని మొదటిసారి తిన్నవారు చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే అలర్జీ శరీరం అంతా వ్యాప్తి చెందుతుంది. నువ్వులు జీర్ణ సమస్యలకు కూడా కారణం అవుతాయి. ఎందుకంటే వీటిలో ఎక్కువ మొత్తంలో ఉండే సంతృప్త కొవ్వులు కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి జీర్ణ సమస్యలను కలిగిస్తుంది.