Water melon: వేసవిలో పుచ్చకాయలు తింటే ప్రమాదమేనా ?
Water melon: వేసవికాలం వచ్చిందంటే పుచ్చకాయలు ఎక్కువ సంఖ్యలో లభిస్తాయి. వీటిని తినడానికి చాలామంది ఆసక్తిని చూపిస్తారు. ఇది ఎంతో రుచిగా ఉంటుంది. అంతే కాకుండా ఇందులో వాటర్ కంటెంట్ అధికంగా ఉండడం వల్ల వేసవికాలంలో ఈ పండు ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఎక్కువసేపు దాహం వేయకుండా ఉంటుంది. దీనిని జ్యూస్ రూపంలో కూడా తయారు చేసుకొని తాగినట్లయితే ఆరోగ్యానికి చాలా మంచిది. ఇందులో ప్రోటీన్స్, విటమిన్స్ శరీరాన్ని ఎండ వేడి నుంచి కాపాడుతాయి. పుచ్చకాయలో ఫైబర్, పొటాషియం, ఐరన్, కాల్షియం అధికంగా ఉంటుంది.

Is it dangerous to eat watermelon in summer
అయితే పుచ్చకాయలు తిన్న వెంటనే కొన్ని రకాల ఆహార పదార్థాలను తిన్నట్లయితే ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు సూచనలు చేస్తున్నారు. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగినట్లయితే అది ఆరోగ్యానికి హానికరం. పుచ్చకాయ తిన్న వెంటనే పాలు తాగడం వల్ల కడుపునొప్పి ఏర్పడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే నీటిని తాగినట్లయితే దాని ప్రభావం ప్రేగులపై పడుతుందని అందువల్ల ప్రేగులపై చెడు ప్రభావం ఏర్పడుతుంది. పుచ్చకాయ తిన్న వెంటనే ప్రోటీన్స్ అధికంగా ఉండే ఆహారం తిన్నట్లయితే జీర్ణవ్యవస్థకు హాని కలుగుతుంది. ఇక చాలామంది పుచ్చకాయలో ఉప్పు వేసుకొని తింటూ ఉంటారు. అయితే ఇలా చేసినట్లయితే పెద్ద ప్రమాదం సంభవిస్తుందట.
Pitapuram: పిఠాపురం నియోజకవర్గంలో నాగబాబుపై తిరుగుబాటు ?
పుచ్చకాయను ఉప్పుతో కలిపి తీసుకున్నట్లయితే బీపీలో హెచ్చు తగ్గులు ఏర్పడతాయని దానివల్ల ప్రమాదం వాటిల్లుతుందని వైద్యులు చెబుతున్నారు. పుచ్చకాయను గుడ్డుతో కలిపి అసలు తినకూడదు. గుడ్డు, పుచ్చకాయ వేరు వేరు స్వభావాలను కలిగి ఉంటాయి. ఈ రెండిటిని కలిపి తిన్నట్లయితే కడుపు ఉబ్బరం, మలబద్ధకం, గ్యాస్ లాంటి సమస్యలు తలెత్తుతాయి. ఇక పుచ్చకాయ తిన్న వెంటనే పెరుగు లేదా మజ్జిగ అస్సలు తాగకూడదు. పెరుగు పుచ్చకాయ ఈ రెండింటిలో వేర్వేరు లక్షణాలను కలిగి ఉండడం వల్ల ఈ రెండింటినీ కలిపి తీసుకున్నట్లయితే కీళ్ల నొప్పులు, మోకాళ్ళ నొప్పులు ఏర్పడతాయి. ఇది ఆరోగ్యానికి మరింత ప్రమాదకరం. ఈ ఆహార పదార్థాలతో పుచ్చకాయను కలిపి తీసుకోకపోతే ఆరోగ్యానికి చాలా మంచిది.
Rohit Sharma: ఐపీఎల్ 2025 నుంచి రోహిత్ శర్మ ఔట్?