Health: ఫ్రిజ్ లో పెట్టిన పుచ్చకాయ తింటే అంత డేంజరా ?
Health: వేసవికాలం వచ్చిందంటే ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే పండ్లలో పుచ్చకాయ ఒకటి. దీనిని ప్రతి ఒక్కరు ఇష్టంగా తింటారు. అయితే పుచ్చకాయ తినడం ఆరోగ్యానికి చాలా మంచిది. కొంతమంది దీనిని తెలియక ఫ్రిడ్జ్ లో పెట్టి తింటూ ఉంటారు. ఇలా అసలు తినకూడదని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఫ్రిడ్జ్ లో పెట్టిన ఈ పండును తినడం వల్ల విటమిన్ ఏ, సి పోషకాలు తగ్గిపోతాయట. అందువల్ల ఇలా తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. అదే విధంగా ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తినడం వల్ల దాని రుచి పూర్తిగా మారిపోతుంది.

Is it dangerous to eat watermelon that has been stored in the fridge
ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయని తినడం వల్ల శరీరానికి ఎలాంటి పోషకాలు అందవు. అలాగే పుచ్చకాయను పోసి ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల దానిమీద బ్యాక్టీరియా పేరుకుపోతుంది. అది విషపూరితంగా కూడా మారే అవకాశాలు ఉంటాయట. అలా ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ తిన్నట్లయితే కడుపునొప్పి, వీరేచనాలు, తల తిరగడం, వాంతులు వంటి అనేక సమస్యలు ఎదురవుతాయి. ముఖ్యంగా చిన్నపిల్లలకు ఫ్రిడ్జ్ లో పెట్టిన పుచ్చకాయ అసలు తినిపించకూడదు. అదేవిధంగా దీనిని ఫ్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల జలుబు, దగ్గు విపరీతమైన తలనొప్పి వస్తాయి. ఇక పుచ్చకాయలు చాలామంది జ్యూస్ చేసుకొని తాగుతూ ఉంటారు.
Also Read: Raisins Benefits: ఎండు ద్రాక్షతో ఇలా చేస్తే… అద్భుత ఫలితాలు ?
ఇలా చేసుకుని తాగినా కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. వేసవికాలంలో ప్రతిరోజు ఒక గ్లాసడు పుచ్చకాయ రసం తాగినట్లయితే శరీరానికి కావాల్సిన ఎన్నో రకాల పోషకాలు అందుతాయి. దానివల్ల నీరసం, అలసట వంటి సమస్యలనుంచి ఉపశమనం లభిస్తుంది. పుచ్చకాయ రసం ఎంతో రుచిగా ఉంటుంది. అంతేకాకుండా శరీరానికి ఎంతో బలాన్ని ఇస్తుంది. అయితే పుచ్చకాయ జ్యూస్ తయారు చేసుకునే సమయంలో అందులో చక్కెరను వేయకుండా జ్యూస్ చేసుకుని తాగినట్లయితే చాలా మంచిదని వైద్యులు సూచనలు చేస్తున్నారు.
Also Read: Sugar Cane Juice: వేసవిలో చెరుకు రసం తాగుతున్నారా..అయితే ఇవి తెలుకోండి ?