The Paradise: “ది ప్యారడైజ్” లో నాని రెండు జడల వెనుక ఆ డైరెక్టర్ నిజ జీవితం దాగి ఉందా.?


The Paradise: నేచురల్ స్టార్ నాని శ్రీకాంత్ ఓదెలా కాంబోలో ఇప్పటికే దసరా వంటి ఊర మాస్ మూవీ వచ్చి బాక్సాఫీస్ వద్ద భారీ హిట్టు కొట్టింది. దసరా మూవీ నాని సినీ కెరీర్ లోనే హైయ్యెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ అని చెప్పుకోవచ్చు.దసరా తర్వాత నాని చేసిన హాయయ్ నాన్న సరిపోదా శనివారం వంటి రెండు సినిమాలు కూడా బ్లాక్ బస్టర్సే. అయితే మళ్లీ శ్రీకాంత్ ఓదెల,నాని కాంబోలో ది ప్యారడైస్ మూవీ వస్తున్న సంగతి మనకు తెలిసిందే.

 Is the real life of the director hidden behind Nani two braids in The Paradise

Is the real life of the director hidden behind Nani two braids in The Paradise

రీసెంట్ గానే ది ప్యారడైస్ మూవీకి సంబంధించి టీజర్ రిలీజ్ చేశారు చిత్ర యూనిట్.ఇక ఈ టీజర్ చూసిన చాలా మంది షాక్ అయిపోయారు. ఎందుకంటే ది ప్యారడైస్ మూవీ టీజర్ లో నానిని ఒక డిఫరెంట్ లుక్ లో చూశారు. రెండు జడలు వేసుకొని బూతులు మాట్లాడుతూ నాని మేకోవరే మార్చేశారు. ఇప్పటివరకు నాని ఇలాంటి సినిమాలో ఎప్పుడూ నటించలేదు. ఒకవేళ ఈ సినిమా బ్లాక్ బస్టర్ అయితే మాత్రం నాని కెరియర్ లోనే ఇది ఒక డిఫరెంట్ సినిమాగా చెప్పుకోవచ్చు. (The Paradise)

Also Read: The Paradise: బ్యాడ్ లక్ అంటే ఆ హీరోదే.. ది ప్యారడైజ్ మూవీ ని రిజెక్ట్ చేసి తప్పు చేశాడా.?

అయితే ఈ సినిమా టీజర్ లో నాని రెండు జడలు వేసుకుని కనిపించారు. అయితే ఈ రెండు జడల వెనుక ఓ పెద్ద స్టోరీ కాదు కాదు పెద్ద ఎమోషన్ దాగి ఉందట. అయితే రెండు జడల వెనుక ఉన్న ఎమోషన్ గురించి చెప్పడానికి డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల ఇష్టపడలేదు. అది సినిమా విడుదల అయ్యే వరకు చెప్పనని డైరెక్టర్ చెప్పారు. కానీ రెండు జడలు వేయడం వెనుక ఒక స్టోరీ ఉందని, నా చిన్నప్పుడు మా అమ్మ నాకు ప్రతిరోజు రెండు జడలు వేసి స్కూల్ కి పంపించేదని,

 Is the real life of the director hidden behind Nani two braids in The Paradise

నేను ఐదవ తరగతి చదివే వరకు కూడా అలాగే రెండు జడలు వేసుకొని స్కూల్ కి వెళ్లే వాడినని,మా అమ్మ నాకు రెండు జడలు వేసి మురిసిపోయేది అంటూ చెప్పుకొచ్చాడు.అలాగే నాని రెండు జడలు వేసుకోవడానికి, కథకు ఎలా కనెక్ట్ అవుతుంది అనే విషయాన్ని మాత్రం నేను ఇప్పుడు చెప్పలేను అంటూ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల రీసెంట్గా ఓ ఇంటర్వ్యూలో చెప్పారు.. మరి చూడాలి ఈ కథకి నాని రెండు జడలు వేసుకోవడానికి వెనుక ఉన్న రిలేషన్ ఏంటో..(The Paradise)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *