Jasprit Bumrah: ముంబై ఇండియన్స్ కు అదిరిపోయే శుభవార్త.. రేసుగుర్రం వచ్చేసింది
Jasprit Bumrah: ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ నేపథ్యంలో… ముంబై ఇండియన్స్ కు అదిరిపోయే శుభవార్త అందింది. ముంబై ఇండియన్స్ కు సంబంధించిన… ఫాస్ట్ బౌలర్ జట్టులో చేరిపోయాడు. గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ కు సంబంధించిన మొదటి దశ మ్యాచ్లకు దూరమైన జస్‌ప్రీత్ బుమ్రా… ఇప్పుడు జట్టులోకి వచ్చాడు.

Jasprit Bumrah Returns From Injury, Provides Big Boost to Mumbai Indians Ahead of IPL 2025
ఇవాళ…. ముంబై ఇండియన్స్ జట్ట లో చేరిపోయాడు జస్‌ప్రీత్ బుమ్రా. దీనికి సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ముంబై ఇండియన్స్ యాజమాన్యం. బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ 2024 టోర్నమెంటు సందర్భంగా నే.. జస్‌ప్రీత్ బుమ్రా కు గాయమైంది. ఇక అప్పటి నుంచి టీమిండియాతో పాటు ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడు జస్‌ప్రీత్ బుమ్రా.
HCU: సీఎం రేవంత్ రెడ్డి పై ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ సంచలన వ్యాఖ్యలు ?
ఇక లేటెస్ట్ గా జట్టులోకి తిరిగి వచ్చేసాడు జస్‌ప్రీత్ బుమ్రా. బెంగళూరు వర్సెస్ ముంబై ఇండియన్స్ మధ్య బిగ్ ఫైట్ జరగనుంది. ఈ మ్యాచ్ లో జస్‌ప్రీత్ బుమ్రా ఆడటం లేదని తెలుస్తోంది. కానీ ఏప్రిల్ 13వ తేదీన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టుతో ముంబై ఇండియన్స్ తలపడనుంది. ఈ మ్యాచ్ కు మాత్రం జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులోకి వస్తాడని చెబుతున్నారు.
HCU: హెచ్‌సీయూ విద్యార్థులపై కొత్త కుట్ర?