KA PAUL: యనమలను ఏపీ సీఎం చేయాలి..చంద్రబాబు రాజీనామా చేయాలి ?

KA PAUL: యనమలను ఏపీ సీఎం చేయాలి..చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు కే ఏ పాల్. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు వెంటనే రాజీనామా చేయాలని… తిరుపతి ఘటనకు బాధ్యత వహించి ముఖ్యమంత్రిగా వెంటనే రాజీనామా చెయ్యాలని ఆగ్రహించారు. బాబు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాడని…. ఆయన రాష్ట్రానికి ముఖ్యమంత్రి అని మర్చిపోతున్నాడని ఆగ్రహించారు.

KA PAUL comments on yanamala and chandrababu

ఆరుగురు భక్తులు చనిపోయారని… పొలిటికల్ ర్యాలీలో ప్రధాని, పవన్ , చంద్రబాబు లతో ఆ సమయంలో బిజీగా ఉన్నారని చురకలు అంటించారు. 2019లో పుష్కరాల సమయంలో 23 మంది చనిపోయారు మరెందరో గాయపడ్డారని…. కందుకూర్లో పొలిటికల్ ర్యాలీ నిర్వహిస్తే అక్కడ చనిపోయారని మండిపడ్డారు. గుంటూరులో ర్యాలీ నిర్వహిస్తే ముగ్గురు చనిపోయారని… తారకరత్న కూడా చంద్రబాబు ర్యాలీలో చనిపోయాడని ఆరోపణలు చేశారు.

చంద్రబాబు నాయుడు నిర్లక్ష్యం వల్లే తిరుపతిలో ఆరుగురు చనిపోయారని… సమస్యలను పక్కన పెట్టారు ప్రజలకు ఇచ్చిన హామీలను పట్టించుకోలేదని ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఎక్కడ ఉంటే అక్కడ మరణాలు తప్పవు… యనమల రామకృష్ణుని ముఖ్యమంత్రిని చేసి చంద్రబాబు రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *