Kayadu Lohar: డ్రాగన్ బ్యూటీ కి తెలుగు లో ఆఫర్.. మాస్ హీరో సరసన!!

Kayadu Lohar: ప్రదీప్ రంగనాథన్ నటించిన “డ్రాగన్” (Return of the Dragon – Telugu) సినిమా విడుదలైన తర్వాత, అందులో కయదు లోహార్ పెర్ఫార్మెన్స్ పై తెలుగు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. సినిమా కథ ఎంత ఇంపార్టెంటో, నటీనటుల పాత్రలు కూడా అంతే ప్రాముఖ్యత వహిస్తాయి. అనుపమ పరమేశ్వరన్ ప్రధాన హీరోయిన్‌గా నటించగా, కయదు లోహార్ రెండో అర్ధంలో ఎంట్రీ ఇచ్చి అదిరిపోయే పెర్ఫార్మెన్స్ ఇచ్చింది. యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమాలో, ఆమె గ్లామర్, యాక్టింగ్ రెండూ ప్రేక్షకులను మెప్పించాయి.
Kayadu Lohar Confirmed for Funky Movie
“డ్రాగన్” కయదు మొదటి సినిమా కాదన్న విషయం చాలామందికి తెలియదు. ఆమె 2021లో కన్నడ సినిమా “ముగిల్పేటే” తో వెండితెరకు పరిచయం అయ్యింది. ఆ తర్వాత 2022లో శ్రీ విష్ణుతో “అల్లూరి” సినిమాలో నటించింది. అయితే, సినిమా విజయవంతం కాకపోవడంతో ఆమెకు సరైన గుర్తింపు రాలేదు. కానీ ఇప్పుడు, “డ్రాగన్” సినిమాతో ఆమె భారీ క్రేజ్ అందుకుంది. తెలుగు యూత్ ఆడియన్స్ ఆమెకు ప్రత్యేకమైన ఫ్యాన్‌బేస్ ఏర్పరుచుకున్నారు. గ్లామర్ & యాక్టింగ్ లో టాలెంట్ చూపిస్తున్న కయదు, త్వరలో మరిన్ని అవకాశాలు దక్కించుకోనుంది.
తాజా సమాచారం ప్రకారం, “మాస్ కా దాస్” విశ్వక్ సేన్ & అనుదీప్ కెవి కాంబినేషన్ లో రాబోతున్న “ఫంకీ” (Funky) సినిమాలో కయదు హీరోయిన్‌గా నటించే అవకాశం ఉంది. మొదట ఆషిక రంగనాథ్, కృతి శెట్టి పేర్లు వినిపించినా, ఇప్పుడు చిత్రబృందం కయదు లోహార్‌ను ఫైనల్ చేయడానికి సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. “డ్రాగన్” తో వచ్చిన క్రేజ్‌ను “ఫంకీ” తో మరింత పెంచుకుంటుందా? అనేది ఆసక్తికరంగా మారింది.
“డ్రాగన్” రిలీజ్ అయినప్పటి నుంచి సోషల్ మీడియాలో కయదు గురించి హాట్ టాపిక్ నడుస్తోంది. యూత్ ఆడియన్స్ ఆమె లుక్స్, స్క్రీన్ ప్రెజెన్స్ ను ఎంతో ఎంజాయ్ చేస్తున్నారు. తెలుగు చిత్ర పరిశ్రమలో కొత్త అవకాశాలతో ముందుకు సాగుతున్న కయదు లోహార్, తన టాలెంట్ & గ్లామర్ తో స్టార్ హీరోయిన్ అవుతుందా? అనేది చూడాల్సిందే.