Kiran Abbavaram: యూత్, ఫ్యామిలీ ఆడియెన్స్ కు నచ్చే “దిల్ రూబా” – కిరణ్ అబ్బవరం!!

Kiran Abbavaram: బ్లాక్‌బస్టర్ హిట్ ‘క’ తర్వాత ‘దిల్ రూబా’ సినిమాతో కిరణ్ అబ్బవరం మళ్లీ ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు . ఇది న్యూ ఏజ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా యూత్ తో పాటు ఫ్యామిలీ ఆడియెన్స్ కు మంచి అనుభూతిని అందిస్తుంది. రుక్సర్ ధిల్లాన్ హీరోయిన్ గా నటిస్తుండగా, శివమ్ సెల్యులాయిడ్స్ మరియు ప్రముఖ మ్యూజిక్ లేబుల్ సారెగమ తమ ఏ యూడ్లీ ఫిలిం సంస్థలో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విశ్వ కరుణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం హోలీ పండుగ సందర్భంగా మార్చి 14న గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ అవుతోంది. ఇప్పటికే టీజర్, ట్రైలర్, పాటలు భారీ రెస్పాన్స్ తెచ్చుకోవడంతో మూవీపై అంచనాలు పెరిగాయి.
Kiran Abbavaram Talks About His Upcoming Film “Dil Ruba”
తాజా ఇంటర్వ్యూలో కిరణ్ అబ్బవరం మాట్లాడుతూ, దిల్ రూబా పక్కా కొత్తదనం కలిగిన ప్రేమ కథగా ఉంటుందని తెలిపారు. తన పాత్ర సిద్ధు భావోద్వేగాలతో నిండిన క్యారెక్టర్ అని, “సారీ”, “థ్యాంక్స్” లాంటి పదాలకు విలువ ఉందని నమ్మే వ్యక్తిగా ఉంటాడని అన్నారు. ఈ కథలో ఎక్స్ లవర్ ప్రెజెంట్ లవర్ కు మద్దతుగా నిలబడటం కొత్త పాయింట్ అని, ఇప్పటి వరకు మన సినిమాల్లో లేని యూనిక్ ఎమోషనల్ టచ్ ఉంటుందని చెప్పారు.
సినిమాలో ఎంటర్ టైన్మెంట్, ఎమోషన్, హాస్యం అన్నీ కలిపి ఫుల్ ప్యాకేజ్ గా ఉంటుందని కిరణ్ వెల్లడించారు. సిద్ధు క్యారెక్టర్ లోని డైలాగ్స్ ప్రేక్షకులను ఆలోచింపజేస్తాయని, కథలోని మోరల్ వాల్యూస్ కూడా బలంగా ఉంటాయని తెలిపారు.
ఇక నుంచి కథల ఎంపికలో జాగ్రత్తలు తీసుకుంటున్నానని, ఈ ఏడాది తన రెండు సినిమాలు రిలీజ్ అవుతాయని, వచ్చే ఏడాది నుంచి ప్రతి ఏడాది కనీసం మూడు సినిమాలు విడుదల చేసేలా ప్లాన్ చేస్తున్నానని కిరణ్ అబ్బవరం తెలిపారు. దిల్ రూబా సినిమాతో ప్రేక్షకులకు ఫ్రెష్ అనుభూతిని అందించనున్నామని తెలిపారు.