Kodali Nani: కొడాలి నాని కి 8 గంటల పాటు సర్జరీ ?
Kodali Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ మంత్రి కొడాలి నానికి సంబంధించిన హెల్త్ అప్డేట్ తాజాగా విడుదలైంది. ఈ హెల్త్ బులిటెన్ ప్రకారం… మాజీ మంత్రి కొడాలి నాని కి 8 గంటల పాటు సర్జరీ చేశారట. ముంబై లో ఉన్న ప్రముఖ ఆసుపత్రిలో… కొడాలి నాని కి సర్జరీ చేసినట్టు తెలుస్తోంది. పాండే అనే వైద్య బృందం కొడాలి నాని కి సర్జరీ ఇచ్చేసిందని చెబుతున్నారు.

Kodali Nani undergoes 8-hour surgery
ఆయన గుండెకు సంబంధించిన సర్జరీని ఎనిమిది గంటల పాటు చేశారట వైద్యులు. ఎనిమిది గంటలు సర్జరీ చేసిన తర్వాత మూడు గంటల పాటు అబ్జర్వేషన్లో కొడాలి నానిని ఉంచినట్లు సమాచారం అందుతుంది. అయితే మొదటగా హైదరాబాదులోని ఏఐజి ఆసుపత్రికి కొడాలి నానిని తరలించారు.
Mad 2: మ్యాడ్ స్క్వేర్ “లడ్డుగాడి” కి విజయ్ దేవరకొండ కి మధ్య ఉన్న రిలేషన్.. అంత దగ్గరా.?
అక్కడ రెండు రోజులపాటు వైద్య చికిత్సలు అందుకున్న కొడాలి నాని.. అనంతరం ముంబై వెళ్లారు. ముంబైలో కొడాలి నాని కి వైద్య పరీక్షలు చేసి సర్జరీ కూడా నిర్వహించారు పాండే వైద్యుల బృందం. ఇక ప్రస్తుతం ఆయన ఆరోగ్యం కుదురుటగా ఉందని చెబుతున్నారు. త్వరలోనే డిశ్చార్జ్ కూడా అవుతారట కొడాలి నాని.
Chiranjeevi: అప్పటి హాట్ బ్యూటీ తో రామ్ చరణ్ పెళ్లి చేయాలనుకున్న చిరంజీవి.. కానీ.?