అక్కినేని అఖిల్ నటించిన లెనిన్ మూవీపై రివ్యూలు మొదలయ్యాయి. ఈ సినిమా అఖిల్ కెరీర్లో టర్నింగ్ పాయింట్ అవుతుందా అని ఫ్యాన్స్ ఆలోచిస్తున్నారు. అఖిల్ ఎన్నో ఎఫర్ట్స్ తీసుకున్నా ఇప్పటివరకు ఒక్క కమర్షియల్ హిట్ కూడా లేదు. ఈ కారణంగా అందరి ఫోకస్ లెనిన్ పైనే ఉంది. నిర్మాత నాగవంశీ, దర్శకుడు మురళి కిషోర్ అందరికీ ఈ సినిమా హిట్ కావడం చాలా ఇంపార్టెంట్.
సితార ఎంటర్టైన్మెంట్స్ మరియు అన్నపూర్ణ స్టూడియోస్ బ్యానర్స్ పై నాగార్జున, నాగవంశీ నిర్మించిన ఈ మూవీకి మురళి కిషోర్ దర్శకుడు. అఖిల్తో పాటు భాగ్యశ్రీ కథానాయికగా నటించింది. లెనిన్ సినిమా జులై 10న విడుదల కానుంది. ఇప్పటికే ఇండస్ట్రీలో చాలా మందికి ప్రివ్యూ చూపించారు. నాగవంశీ, నాగార్జున అందరూ ఈ సినిమాపై ఫుల్ కాన్ఫిడెన్స్ లో ఉన్నారు. ఈ సినిమా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్తో మొదలవుతుందట.
కథ అంతా చిత్తూరు దగ్గర్లోని శ్రీరామపురం అనే గ్రామంలో జాతర నేపథ్యంలో సాగుతుంది. ఆ ఊరిలో అధికారం కోసం యాక్షన్ డ్రామా కొనసాగుతుంది. అఖిల్ ఇంట్రో మరియు దానితో వచ్చే యాక్షన్ సీక్వెన్సెస్ అదిరిపోతాయట. హీరోయిన్ ఇంట్రో సరికొత్తగా సీనియర్ ఎన్టీఆర్ డైలాగ్తో నాటకాల మధ్యలో ఉంటుంది. అఖిల్-భాగ్యశ్రీ లవ్ స్టోరీ ట్రాక్ బాగుంది. వీళ్ళ మధ్య రొమాన్స్ మరియు సాంగ్స్ ఆకట్టుకుంటాయి.
పల్లెటూరి నేపథ్యంలో ఈ మూవీ యాక్షన్ డ్రామాగా రూపొందింది. అఖిల్ తొలిసారి మాస్ లుక్స్తో ఊరి కుర్రాడిగా కనిపించాడు. ఇంటర్వెల్ మరియు క్లైమాక్స్లో ఆసక్తికర ట్విస్ట్లు ఉన్నాయి. నమ్మినవాళ్ళే మోసం చేస్తారు, రెండు కీలక పాత్రలు చనిపోతాయి. దాంతో హీరో రివెంజ్ మోడ్లోకి మారతాడు. ట్విస్ట్లు వర్కౌట్ అయితే లెనిన్ మంచి హిట్ అవుతుందని టాక్ వినిపిస్తుంది. రేపు ఉదయం 5 గంటల నుంచి తెలుగు రాష్ట్రాల్లో షోలు మొదలవుతాయి.





