
టాలీవుడ్ యాక్టర్ Suhas కోలీవుడ్‌లో అడుగుపెడుతున్న చిత్రం మందాడి ఇప్పుడు ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తిస్తోంది. సూరి మరో ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమాను సెల్ఫీ ఫేం మతిమారన్ పుగళేంది తెరకెక్కిస్తున్నారు. తీర ప్రాంతం, మత్య్సకారుల జీవితం నేపథ్యంలో స్పోర్ట్స్ డ్రామాగా రూపొందుతున్న ఈ చిత్రం సెప్టెంబరు 4న గ్రాండ్‌గా విడుదల కానుంది.
తాజాగా చిత్రబృందం విడుదల చేసిన కొత్త పోస్టర్, మేకింగ్ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతున్నాయి. ఇందులో Suhas సాట్టపులి పాత్రలో కనిపించబోతున్నట్లు స్పష్టమైంది. లాంగ్ హెయిర్, స్టైలిష్ గాగుల్స్, సిగరెట్ వెలిగించే మాస్ లుక్‌తో ఆయన గతంలో చూడని కొత్త అవతారంలో కనిపించనున్నారని వీడియోనే చెబుతోంది. దీంతో మందాడి సినిమాపై హైప్ మరింత పెరిగింది.
రియలిస్టిక్ అనుభూతి కోసం మేకర్స్ ఈ చిత్రాన్ని ఎక్కువగా రియల్ లొకేషన్స్‌లో షూట్ చేశారు. పోస్టర్లతో పాటు విడుదలైన విజువల్స్ కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. మహిమా నంబియార్ కీలక పాత్రలో నటిస్తుండగా, సత్యరాజ్, రవీంద్ర, విజయ్, అచ్యుత్ కుమార్ ఇతర ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ సినిమాకు జీవీ ప్రకాశ్ కుమార్ సంగీతం, బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. సముద్రంలో సాగే హై ఇంటెన్సిటీ యాక్షన్ సీన్స్, సెయిల్ బోట్ రేస్ ఈ చిత్రానికి ప్రధాన ఆకర్షణగా నిలవనున్నాయి. పీటర్ హెయిన్స్ వంటి ప్రముఖ యాక్షన్ కొరియోగ్రఫర్‌తో పని చేయడం సినిమాపై అంచనాలను మరింత పెంచింది. ఈ సినిమాతో Suhasకు సౌత్‌లో మరో బలమైన గుర్తింపు దక్కే అవకాశముందని సినీ వర్గాలు భావిస్తున్నాయి.




















