Mangalavaram 2: అజయ్ భూపతి బిగ్ అప్డేట్.. సూపర్ నేచురల్ థ్రిల్లర్గా సీక్వెల్

Scene from Mana film

డైరెక్టర్ అజయ్ భూపతి నుంచి Mangalavaram 2 పై పెద్ద update వచ్చింది. ఈ సీక్వెల్ ఇప్పుడు supernatural thriller గా రాబోతుందని ఫ్యాన్స్‌కు షాకింగ్ న్యూస్. మొదటి భాగం గ్రామీణ background లో మిస్టరీ థ్రిల్లర్‌గా హిట్ అయితే, ఈసారి కథలో అలౌకిక శక్తులను కూడా ఎడ్ చేస్తున్నట్లు డైరెక్టర్ స్వయంగా చెప్పేశారు. ఇప్పుడు ఆయన ‘శ్రీనివాస మంగాపురం’ మూవీ ప్రమోషన్స్‌లో busy గా ఉన్నారు. ఆ మూవీ జులై 30న రిలీజ్ కాగానే, ఫుల్ గా Mangalavaram రెండో భాగం మీద focus పెట్టాలని ప్లాన్ చేస్తున్నారు.

Mangalavaram 2 Supernatural Thriller

మొదటి సినిమాలో Payal Rajput నటన, Ajaneesh Loknath బ్యాక్‌గ్రౌండ్ స్కోర్‌కి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఆ same vibe ని క్యారీ ఫార్వార్డ్ చేస్తూనే, కొన్ని ఊహించని ట్విస్టులు వేస్తే సూపర్‌హిట్ అవుతుందని అజయ్ భూపతి కాన్ఫిడెంట్‌గా ఉన్నారు. ప్రతి character, ప్రతి ఈవెంట్ ఆడియన్స్‌ని లాస్ట్ వరకు థ్రిల్ చేసేలా స్క్రిప్ట్ తయారు చేశారు. ఇంతకు ముందు ‘RX 100’ తో హిట్ కొట్టి, ‘మహా సముద్రం’తో డిసపాయింట్ చేసిన ఈ డైరెక్టర్, మళ్లీ ‘మంగళవారం’తో కంబ్యాక్ అయ్యి ఇప్పుడు సూపర్ నేచురల్ ఎలిమెంట్స్‌తో మరో సర్‌ప్రైజ్ ప్లాన్ చేస్తున్నారు.

ఫిల్మ్ నగర్ లో టాక్ ప్రకారం, ఈ Mangalavaram 2 స్టోరీ ని కొరటాల శివకు వినిపించినట్లు తెలుస్తోంది. కథ నచ్చడంతో ఆయన తన యువసుధ ఆర్ట్స్ బ్యానర్‌లో ప్రొడ్యూస్ చేయడానికి కూడా రెడీ అయ్యారట. అయితే అఫీషియల్ గా ఏమీ కన్ఫర్మ్ కాలేదు. అజయ్ భూపతి చెప్పినట్లు ‘శ్రీనివాస మంగాపురం’ రిలీజ్ అయిన తర్వాత మాత్రమే రెండో భాగం మీద పూర్తి ఫోకస్ పెడతారు. అప్పుడు కాస్టింగ్, ఇతర డిటైల్స్ అన్నీ రివీల్ అవుతాయి.

ఇప్పుడు టాలీవుడ్‌లో ఈ ప్రాజెక్ట్ చాలా హాట్ టాపిక్‌గా మారింది. ఫస్ట్ పార్ట్‌లో వచ్చిన వరుస మరణాలు, గ్రామీణ అమోస్ఫియర్ అందర్నీ ఆకట్టుకుంది. ఇప్పుడు అందులో సూపర్ నేచరల్ ఎలిమెంట్స్ కలిస్తే, అది మరింత థ్రిల్లింగ్‌గా ఉంటుందన్న అంచనాలు ఎక్కువగా ఉన్నాయి. ఫ్యాన్స్ ఇప్పటినుంచే అఫీషియల్ అనౌన్స్‌మెంట్ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అజయ్ భూపతి వారిని ఎప్పుడు సర్‌ప్రైజ్ చేస్తారో చూడాలి.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu