Spirit: “స్పిరిట్” లో ప్రభాస్ కి విలన్ గా మెగా హీరో..?
Spirit: ప్రభాస్ సందీప్ రెడ్డి వంగా డైరెక్షన్లో చేస్తున్న తాజా మూవీ స్పిరిట్..ఈ సినిమాకి సంబంధించి గత రెండు మూడు సంవత్సరాల నుండి వార్తలు వినిపిస్తున్నప్పటికీ ఈ సినిమా ఇంకా పట్టాలెక్కడం లేదు. అయితే ఈ ఏడాది చివర్లో అయినా వచ్చే ఏడాది స్టార్టింగ్ లో అయినా ఈ సినిమాకి సంబంధించి షూటింగ్ స్టార్ట్ చేసే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి.అయితే సినిమా స్టార్ట్ చేసే సమయానికి ఎలాంటి ఇబ్బందులు ఉండకుండా ముందుగానే అన్ని సిద్ధం చేసి పెట్టుకుంటున్నారట డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా.
Mega hero as villain for Prabhas in Spirit
అయితే ఈ సినిమా కోసం ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ రెడీ అయిందని,పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ కూడా పూర్తయింది అని తెలుస్తోంది. అలాగే ఈ సినిమాలో ప్రభాస్ రేంజ్ కి తగ్గట్టు ఎంతోమంది ఈ సినిమాలోని పాత్రలకు తగ్గట్టు ఉండే నటీనటులను ఎంపిక చేసే పనిలో పడ్డారట చిత్ర యూనిట్. ఇక స్పిరిట్ సినిమాలో ప్రభాస్ ని చాలా కొత్తగా చూపిస్తున్నామని అలాగే ఈ సినిమా చూసే వాళ్లందరికీ డ్రగ్స్ లాగా మత్తు ఎక్కుతుంది అని,ఇది పక్కా రా మెటీరియల్ అంటూ సందీప్ రెడ్డివంగా ఇప్పటికే చెప్పుకొచ్చారు. (Spirit)
Also Read: Sreeja: మెగా డాటర్ శ్రీజ లవ్ స్టోరీతో సినిమా.. ఆ బ్లాక్ బస్టర్ సినిమా ఏంటంటే.?
ఇక అనిమల్, అర్జున్ రెడ్డి వంటి సినిమాల్లో సందీప్ రెడ్డి వంగా ఎలా అయితే బోల్డ్ గా చూపించారో ఈ సినిమాలో కూడా అలాగే చూపించబోతున్నట్టు తెలుస్తోంది. అయితే తాజాగా టాలీవుడ్ సర్కిల్స్ నుండి వినిపిస్తున్న సమాచారం ప్రకారం.. స్పిరిట్ లో ప్రభాస్ కి విలన్ గా ఆ మెగా హీరోని తీసుకున్నట్టు రూమర్ లు వినిపిస్తున్నాయి. ఇక ఆ హీరో ఎవరంటే మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్.. స్పిరిట్ మూవీలో ఓ పాత్రకి మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కరెక్ట్ గా సెట్ అవుతారని సందీప్ రెడ్డి వంగా అనుకున్నారట.
అయితే ఈ స్టోరీ గురించి వరుణ్ కి కూడా చెప్పగా ఆయన కూడా పాజిటివ్ గా స్పందించినట్టు తెలుస్తోంది. అయితే అఫీషియల్ గా ఇప్పటి వరకు ఈ విషయాన్ని బయట పెట్టకపోయినప్పటికి స్పిరిట్ సినిమాలో వరుణ్ తేజ్ నటించబోతున్నట్టు రూమర్లు వినిపిస్తున్నాయి. ఇక టాలీవుడ్ సినీ వర్గాల నుండి వినిపిస్తున్న రూమర్స్ ప్రకారం.. ప్రభాస్ సినిమాలో వరుణ్ తేజ్ విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న రోల్ లో నటించబోతున్నట్టు వార్తలు వినిపిస్తున్నాయి. స్పిరిట్ లో మెగా హీరో నటిస్తున్నాడు అనే వార్తల్లో ఎంత నిజం ఉందో తెలియాలంటే చిత్ర యూనిట్ అఫీషియల్ గా బయట పెట్టే వరకు వేచి చూడాల్సిందే.(Spirit)