Money Plant Astro Tips: ఇంట్లో మనీ ప్లాంట్ ఎక్కడ పెట్టాలి.. ఏ దిక్కులో పెట్టాలి ?
Money Plant Astro Tips: మనీ ప్లాంట్ ను ఇంట్లో పెంచుకోవడం చాలా మందికి ఇష్టం. ఇంట్లో మనీ ప్లాంట్ పెట్టుకుంటే డబ్బు, అందంతో పాటు ఆనందం కూడా ఉంటుంది. అంతేకాకుండా వాస్తు పరంగా చాలా మంచి జరుగుతుందని అందరి నమ్మకం. ఈ ప్లాంట్ కు డబ్బును ఆకర్షించే గుణం ఉందని అంటారు. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకున్నట్లయితే తూర్పు, పశ్చిమ దిశలో ఎప్పుడు ఉంచకూడదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. Money Plant Astro Tips
Money Plant Astro Tips
ఇలా చేసినట్లయితే ఇంట్లో ఇబ్బందులు పడాల్సి వస్తుందని అంటున్నారు. మనీ ప్లాంట్ పక్కన ఎరుపు రంగులో ఎలాంటి వస్తువులు ఉంచకూడదని చెబుతున్నారు.. చాలామంది ఇంట్లోనే వంటగదిలో మనీ ప్లాంట్ పెంచుతారు. ఇలా పెట్టడం మంచిది కాదని వాస్తు శాస్త్ర నిపుణులు చెబుతున్నారు. మనీ ప్లాంట్ కొనుగోలు చేసే సమయంలో గుండె ఆకారపు ఆకులతో కూడిన మనీ ప్లాంట్ కొనాలి. ఇది సంపద, శ్రేయస్సును తీసుకువస్తుంది. ఆరోగ్యకరమైన సంబంధాలను ప్రోత్సహిస్తుంది. Money Plant Astro Tips
Also Read: Hot Water Bath: వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా.. ఈ జబ్బు రావడం ఖాయం ?
ఎల్లప్పుడూ గ్రీన్ మనీ ప్లాంట్ ని కొనుగోలు చేయాలి. మనీ ప్లాంట్ పైన మీరు ఎంత శ్రద్ధ చూపుతారనేది చాలా ముఖ్యం. ఆకులు పచ్చగా ఉంటే మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది. డ్రై మనీ ప్లాంట్ విపత్తు దురదృష్టానికి సంకేతం. అందువల్ల క్రమం తప్పకుండా నీరు పోయడం చాలా అవసరం. మొక్క ఆకులు వాడిపోకూడదు. చాలా ఆరోగ్యంగా ఉండాలి. ఇంట్లో మనీ ప్లాంట్ పెంచుకునే వారు మొక్కను నేల నుంచి దూరంగా ఉంచడం మంచిది. ఆకులు ఎండిపోవడం లేదా వాడిపోతుంటే వాటిని కత్తిరించాలి. Money Plant Astro Tips