Nara Lokesh: ఏపీలో సమస్యలు.. దుబాయ్‌ లో లోకేష్‌ ?


Nara Lokesh: ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. ఆదివారం రోజున ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ జరిగిన సంగతి తెలిసిందే. ఈ మ్యాచ్‌ లో టీమిండియా గ్రాండ్‌ విక్టరీ కొట్టింది. విరాట్‌ కోహ్లీ, గిల్, శ్రేయస్‌ అయ్యర్‌ అద్భుతంగా ఆడటంతో… టీమిండియా విజయం సాధించింది.

Nara Lokesh Enjoying India Vs Pakistan Match In Dubai With Out Caring Group-2 Candidates Protest

అయితే.. ఛాంపియన్స్‌ ట్రోఫీ 2025 టోర్నమెంట్ లో భాగంగా… ఇండియా-పాకిస్తాన్ మధ్య మ్యాచ్‌ కు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్‌, రావడం జరిగింది. మెగాస్టార్‌ చిరంజీవి కూడా ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు. అయితే…ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేసిన ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పై ఏపీ ప్రజలు ఆగ్రహిస్తున్నారు.

Champions Trophy 2025: లైవ్ ఎక్కడ చూడాలి? పూర్తి షెడ్యూల్ ఇదే!!

గ్రూప్ 2 పరీక్ష వాయిదా వెయ్యని ఏపీపీఎస్సిని నిరుద్యోగులు నిలదీస్తున్నారు. ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా గ్రూప్ 2 అభ్యర్థులు ఆందోళన కు దిగారు. రోడ్డు ఎక్కి.. నిరసనలు తెలిపారు. ఈ తరుణంలోనే… ఇండియా-పాకిస్తాన్ మ్యాచ్ చూస్తూ ఎంజాయ్ చేశారు ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్. విద్యార్థుల సమస్యలు పట్టకుండా.. లోకేష్‌ దారుణంగా వ్యవహరించారని మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *