వార్ 2 సినిమా రిలీజ్ టైమ్ లో అనంతపురంలోని ఎన్టీఆర్ ఫ్యాన్ కు ఎమ్మెల్యే దుర్గప్రసాద్ ఫోన్ చేసి బూతులు తిట్టాడు. దీనికి సంబంధించిన ఆడియో బయటకు రావడంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సదరు ఎమ్మెల్యే ఇంటి ముందుకు ఎన్టీఆర్ ఫ్యాన్స్ చేరుకోవడం పరిస్థితి ఉద్రిక్తతిగా మారడం తెలిసిందే. దీంతో పోలీసులు ముందస్తు జాగ్రత్త అంటూ అభిమానులను అరెస్ట్ చేశారు. గొడవలు ముదురుతున్నాయి.
ఈ విషయం గురించి ఎన్టీఆర్ స్పందించలేదు. వార్ 2 రిలీజ్ తర్వాత ఆ రిజెల్ట్ చూసి విదేశాలకు వెళ్లిపోయాడని టాక్ వినిపిస్తుంది. సోషల్ మీడియాలో కూడా ఎన్టీఆర్ నుంచి ఏ స్పందనా లేదు. అభిమానులు మాత్రం రెచ్చిపోతున్నారు. సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంపై సీరియస్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఏది ఏమైనా ఫ్యాన్స్ మాత్రం శాంతించడం లేదు. సదరు ఎమ్మెల్యే బ్యానర్స్, కటౌట్స్ చించేస్తూ తమ ఆగ్రహాన్ని ప్రదర్శిస్తున్నారు.





