One Nation One Election: కేంద్రం కొత్త వ్యూహం – 2029 ఎన్నికల లెక్కలు

కేంద్రం One Nation One Election ను 2029 నాటికి అమలు చేయడానికి కొత్త వ్యూహాలు సిద్ధం చేస్తోంది. ఈ ప్లాన్ లో భాగంగా మహిళా రిజర్వేషన్ మరియు డీలిమిటేషన్ బిల్లులను పార్లమెంట్ సమావేశాల్లో ప్రవేశపెట్టనున్నారు. ఈ నెల 20 నుంచి ప్రారంభమయ్యే సెషన్ లో ఈ కీలక బిల్లులను పాస్ చేయడానికి బీజేపీ సంఖ్యాబలాన్ని సమకూర్చుకుంది. ఇప్పటికే శివసేన (థాకరే), టీఎంసీ చీలిక నేతలు, ఆప్ నుంచి వచ్చిన ఎంపీలతో ఎన్డీఏ బలం పెరిగింది. ఈ నేపథ్యంలో మోదీ 4.0 కోసం ప్రణాళికలు రూపొందుతున్నాయి.

డీలిమిటేషన్ పై కొత్త ఫార్ములా అమలు చేయనున్నారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా ఈ నిర్ణయం ఉంటుందని అధికార వర్గాలు చెబుతున్నాయి. అలాగే 2029 లోనే One Nation One Election నిర్వహణకు కేంద్రం వ్యూహాత్మకంగా అడుగులు వేస్తోంది. జేపీసీ చీఫ్ పీపీ చౌదరి మాట్లాడుతూ, దాదాపు 99 శాతం మంది ఈ ప్రతిపాదనను సమర్థించారని, అన్ని పార్టీలకు ఆమోదయోగ్యమైన వ్యవస్థ కోసం కృషి చేస్తున్నామని చెప్పారు.

గోవా సీఎం తో సహా పలు రాష్ట్రాల నేతల అభిప్రాయాలను సేకరించినట్లు తెలుస్తోంది. జమిలి ఎన్నికల వల్ల ఎదురయ్యే సవాళ్లు, వాటి పరిష్కారంపై చర్చలు జరిగాయి. జేపీసీ నివేదిక సమర్పణకు సిద్ధంగా ఉంది. దీంతో 2029 ఎన్నికలు పూర్తిగా కొత్త లెక్కలతో, అంచనాలతో జరగడం ఖాయంగా మారింది.

One Nation One Election తో పాటు మహిళా రిజర్వేషన్లు, కొత్త నియోజకవర్గాల ఏర్పాటు వంటి మార్పులు 2029 లోనే అమల్లోకి వచ్చే అవకాశం ఉంది. ఈ ప్లాన్ లు అన్నీ బీజేపీ యథావిధిగా అమలు చేయగలిగితే, 2029 ఎన్నికలు చారిత్రకంగా మారుతాయని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు.

Share your love