Pawan Kalyan: ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయిన పవన్ కళ్యాణ్.. అన్నా లెజినోవా భావోద్వేగ పోస్ట్!

Pawan Kalyan ఇప్పుడే ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఈ విషయంలో ఆయన భార్య అన్నా లెజినోవా సోషల్ మీడియాలో ఓ ఎమోషనల్ పోస్ట్ పెట్టారు. అది ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎంకు ముంబైలో సక్సెస్ అయిన సర్జరీ అయింది. కుడి భుజంలో నొప్పితో బాధపడుతున్న పవన్ కోసం డాక్టర్లు మూడున్నర గంటల పాటు ఆపరేషన్ చేశారు. ఇప్పుడు ఆయన హోం ఐసోలేషన్లో ఉన్నారు.

Pawan Kalyan Hospital Discharge News

అన్నా లెజినోవా తన పోస్ట్లో చాలా థాంక్ఫుల్ గా ఫీల్ అయ్యారు. డాక్టర్ దిన్షా పార్థీవాలా టీమ్కు స్పెషల్ థాంక్స్ చెప్పారు. వాళ్ళ నైపుణ్యం వల్లే తమ ఫ్యామిలీకి పీస్ ఆఫ్ మైండ్ వచ్చిందని చెప్పారు. డాక్టర్ల పేర్లు కూడా పేర్కొంటూ ఈ క్రిటికల్ టైంలో చూపించిన కేర్ కు రుణపడి ఉంటామని రాశారు. ఈ సర్జరీ లేకుండా పవన్ కి నొప్పి మరింత పెరిగేదేమోనని అనిపిస్తుంది.

పవన్ షోల్డర్ పెయిన్ విషయం కొత్తేమీ కాదు. 2016 నుంచే ఈ ప్రాబ్లమ్ వస్తుండేది. వారాహి యాత్రలు, ఎన్నికల ప్రచారాలు, ఫ్యాన్స్ లాగడం వల్ల రొటేటర్ కఫ్ మసల్స్ తీవ్రంగా డ్యామేజ్ అయ్యాయి. అందులో చిన్న ఫ్రాక్చర్ కూడా ఉండటంతో సర్జరీ తప్పలేదు. డాక్టర్లు ఇప్పుడు పూర్తి రెస్ట్ అంటూ మూడు వీక్స్ పాటు ఏం పని చేయకూడదని స్ట్రిక్ట్ ఆర్డర్లు ఇచ్చారు.

జనసేన ఫ్యాన్స్ కి ఇప్పుడు తమ లీడర్ సేఫ్ గా ఉన్నారనే హ్యాపీనెస్. వాళ్ళు సోషల్ మీడియాలో స్పీడ్ రికవరీ కోసం విషెస్ చెప్పుకుంటున్నారు. అసలు ఈ సర్జరీ ఎంత పెద్దదో డాక్టర్ల మాటల్లోనే తెలుస్తుంది. పవన్ ఇప్పుడు కంప్లీట్ మానిటరింగ్ లో ఉండాల్సిన పరిస్థితి. కానీ అన్నా లెజినోవా పోస్ట్ చూస్తే, ఫ్యామిలీ అంతా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్లుంది.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu