హైదరాబాద్ శివార్లలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఫామ్ హౌస్ వివాదం ఒక్కసారిగా హాట్ టాపిక్ అయ్యింది. ఆయన చెరువు కబ్జా చేశారనే ఆరోపణలపై ఇప్పుడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్వయంగా క్లారిటీ ఇవ్వడంతో అసలు నిజాలు బయటకు వచ్చాయి. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ కథనానికి అధికారిక వివరణ లభించింది.
Pawan Kalyan Farm House Controversy Explained
కమిషనర్ రంగనాథ్ తెలిపిన వివరాల ప్రకారం, పవన్ 2014లో సుమారు పది ఎకరాల land కొనుగోలు చేశారు. అయితే 2016-17 మధ్య కాలంలో రెవెన్యూ రికార్డుల రీమార్కింగ్ ప్రక్రియ జరిగింది. ఈ సమయంలోనే ఆ land లో దాదాపు ఆరు నుంచి ఏడు ఎకరాలు చెరువు FTL పరిధిలోకి వచ్చేలా గుర్తించారు. మిగతా మూడు ఎకరాలు మాత్రం FTL బయటే ఉన్నాయి. చెరువు భూములకు కూడా పట్టాలు ఉండటం చాలా కామన్ అని, రాష్ట్రంలో చాలా చోట్ల ఇలాంటివి కనిపిస్తాయని ఆయన స్పష్టం చేశారు.
పవన్ వాళ్లు తమ land లో నీటి ప్రవాహాన్ని ఆపేలా గానీ, చెరువుకు నష్టం కలిగించేలా గానీ ఎలాంటి construction చేయలేదని రంగనాథ్ తేల్చి చెప్పారు. కేవలం boundary కోసం కంచె వేయడం తప్ప, అక్కడ మరే ఇతర నిబంధనలను అతిక్రమించలేదు. వ్యవసాయం చేసుకోవడం వరకు ఎలాంటి ఇబ్బంది లేదని, కానీ పూర్తి స్థాయి నిర్మాణాలు మాత్రం చేయకూడదనే నిబంధన ఉందని ఆయన వివరించారు. పక్కనే ఉన్న మరికొందరు రైతులు మాత్రం మట్టి తవ్వకాలు, constructions తో రూల్స్ violate చేశారని కమిషనర్ గుర్తించారు.
అసలు ఈ మొత్తం issue సోషల్ మీడియాలో ఒక specific agenda తో నడిపించబడిందని రంగనాథ్ అభిప్రాయపడ్డారు. “పవన్ గారు చెరువు ఆక్రమించారనడం పూర్తిగా తప్పు. ఇది కావాలని చేస్తున్న దుష్ప్రచారం మాత్రమే” అని ఆయన కుండబద్దలు కొట్టినట్లు చెప్పేశారు. తెలంగాణ రక్షణ సేన నాయకురాలు కవిత సైతం ఈ విషయంలో జరిగిన తప్పుడు ప్రచారాన్ని నమ్మి ఆరోపణలు చేశారనే టాక్ వినిపిస్తోంది. కానీ హైడ్రా అధికారిక clarification తో పవన్ పై వచ్చిన ఆరోపణలన్నీ నీరుగారిపోయాయి.





