

HYDRA Ranganath: వివాదంలో హైడ్రా కమిషనర్ రంగనాథ్ చిక్కుకున్నారు. హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆత్మహ***త్యాయత్నం చేసుకున్నాడు. హయాత్‌నగర్‌లోని తన ఇంట్లో.. తుపాకీతో కాల్చుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ కృష్ణ చైతన్య. దీంతో వెంటనే అతనిని కామినేని ఆస్పత్రికి తరలించారు కుటుంబ సభ్యులు. ప్రస్తుతం హైడ్రా కమిషనర్ రంగనాథ్ గన్‌మ్యాన్ ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందని అంటున్నారు. HYDRA Ranganath
Hydra Commissioner Ranganath in controversy
బెట్టింగ్ యాప్స్‌కి బానిసై అప్పులపాలైన కృష్ణ.. అవి తీర్చలేకే సూసైడ్‌కి పాల్పడినట్టు సమాచారం అందుతోంది. అయితే, దీనిపై హైడ్రా కమిషనర్ రంగనాథ్ స్పందించారు. ఈ విషయాన్ని సంచలనం చేయవద్దని మీడియాను కోరుతున్నానని తెలిపారు. ఈ రోజు ఉదయం LB నగర్ కామినేనిలో కానిస్టేబుల్ చైతన్యను కలిశానన్నారు. అతని పరిస్థితి విషమంగా ఉందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. HYDRA Ranganath
Also Read: Kolikapudi Srinivasa Rao: మరో వివాదంలో కొలికపూడి శ్రీనివాస్ రావు… ఏకంగా అధ్యక్షుడిపై హాట్
అతను ఆర్థిక సమస్యల కారణంగా ఆత్మహత్యకు ప్రయత్నించాడని వివరించారు. దాదాపు 2 సంవత్సరాల క్రితం బెట్టింగ్ యాప్‌లు/గేమింగ్ యాప్‌లలో పాల్గొనడం వల్ల అతను ఆర్థిక ఇబ్బందుల్లో పడ్డాడని తెలిపారు. అప్పుల కారణంగా అతని జీతంలో ఎక్కువ భాగం కట్ అవుతోందన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. ఈ రోజు ఉదయం అతను ఆత్మహత్యకు ప్రయత్నించాడు.. అతను బతికే ఉన్నాడన్నారు హైడ్రా కమిషనర్ రంగనాథ్. బతికే అవకాశాలు చాలా తక్కువ అని వివరించారు. HYDRA Ranganath
Also Read: Jagan-KCR: పెను సంచలనం..తాడేపల్లి నివాసం వద్ద జగన్, కేసీఆర్, కేటీఆర్ కటౌట్
https://twitter.com/pulsenewsbreak/status/2002641823349842344?s=20







