Perni Nani: పేర్ని నానిని కాపాడుతున్న చంద్రబాబు?
Perni Nani: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో… మాజీ మంత్రి పేర్ని నానిని కాపాడుతున్నారు చంద్రబాబు నాయుడు. తాజాగా మాజీ మంత్రి పేర్ని నాని చేసిన కామెంట్లు చూస్తుంటే అదే స్పష్టం అవుతుంది. తన భార్య అరెస్టు కాకుండా కాపాడుతున్నది చంద్రబాబు నాయుడు అన్నట్లు పరోక్షంగా వ్యాఖ్యానించారు. ఇటీవల బియ్యం స్కామ్ కేసులో పేర్ని నాని భార్యపై కేసు నమోదు అయిన సంగతి తెలిసిందే. Perni Nani
Perni Nani praises Chandrababu
దీంతో పేర్నినాని కుటుంబం అజ్ఞాతంలోకి వెళ్లినట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలపై తాజాగా పేర్ని నాని స్వయంగా స్పందించారు. తాను ఎక్కడికి పారిపోలేదని క్లారిటీ ఇచ్చారు. అయితే తన భార్యను అరెస్టు చేయించేందుకు ఒక ఏపీ మంత్రి కుట్రలు పన్నుతున్నాడని పరోక్షంగా కొల్లు రవీంద్ర పై ఆగ్రహం వ్యక్తం చేశాడు పేర్ని నాని. Perni Nani
Also Read: Roja: రోజా సంచలన కామెంట్స్…జైల్లో పెడతావా పెట్టుకో..?
మొదటినుంచి నాని అలాగే కొల్లు రవీంద్ర ఇద్దరు ప్రత్యర్ధులు అన్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే… పేర్ని నాని కుటుంబాన్ని అలాగే ఆయన భార్యను అరెస్టు చేయాలని చంద్రబాబును కోరారట కొల్లు రవీంద్ర. కానీ చంద్రబాబు మాత్రం మహిళల జోలికి వెళ్లకూడదని కోరారట. అరెస్టు చేస్తే పేర్ని నానిని అరెస్టు చేయండి కానీ ఆయన భార్యను టచ్ కూడా చేయవద్దని తెలిపారట. ఇదే విషయాన్ని స్వయంగా… పేర్ని నాని తాజాగా పేర్కొన్నారు. అయితే దీనికి కొల్లు రవీంద్ర కౌంటర్ ఇవ్వడం జరిగింది. తప్పు చేస్తే మహిళా అయితే ఏంటి పురుషుడు అయితే ఏంటి అన్నట్లు కౌంటర్ ఇచ్చారు. Perni Nani