PM Modi Message: షార్ట్కట్లపై యువతకు హెచ్చరిక, శ్రమకు ప్రత్యామ్నాయం లేదు

సోషల్ మీడియా యుగంలో రీల్స్, షార్ట్ వీడియోలు, ఇన్ఫ్లుయెన్సర్ల ప్రభావం రోజురోజుకూ పెరుగుతోంది. ఈ క్రమంలోనే యువత, ముఖ్యంగా జెన్-జెడ్ తరం వారు సులభమైన మార్గాలను, షార్ట్కట్లను ఎంచుకోవడం పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆందోళన వ్యక్తం చేశారు. విజయం అంటే తక్షణం లభించేది కాదని, శ్రమకు ప్రత్యామ్నాయం లేదని ఆయన స్పష్టం చేశారు.

మాజీ రాష్ట్రపతి రామ్నాథ్ కోవింద్ ఆత్మకథ ‘ది ట్రయంఫ్ ఆఫ్ ది ఇండియన్ రిపబ్లిక్: మై లైఫ్, మై స్ట్రగుల్’ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న ప్రధాని మోడీ.. ఈ సందర్భంగా యువతకు పలు కీలక సూచనలు చేశారు. కోవింద్ జీవిత ప్రయాణమే యువతకు గొప్ప ఆదర్శమని, ఆయన ప్రజాసేవా స్ఫూర్తిని ప్రతి ఒక్కరూ అనుసరించాలని ప్రధాని పేర్కొన్నారు.

కేవలం సోషల్ మీడియాలో కనిపించే తాత్కాలిక విజయాల వెనుక పరుగెత్తడం కంటే, నిజమైన నైపుణ్యాన్ని పెంపొందించుకోవడం ఎంతో అవసరమని ప్రధాని సూచించారు. షార్ట్కట్లు, సులభ మార్గాలు ఎప్పటికీ శాశ్వత ఫలితాలను ఇవ్వవని, కష్టపడి పనిచేసే వారే చివరికి గెలుస్తారని ఆయన నొక్కి చెప్పారు. యువత తమ లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని చేరుకోవడానికి స్థిరమైన కృషి చేయాలని మోడీ పిలుపునిచ్చారు.

Share your love