Sandeep Reddy Vanga Conditions : ప్రభాస్‌కు సందీప్ వంగా భారీ కండీషన్స్.. స్పిరిట్ మూవీ కోసం ప్రభాస్ స్పెషల్ లుక్!!

Sandeep Reddy Vanga Conditions: సందీప్ రెడ్డి వంగా తన ప్రత్యేకమైన దర్శకత్వ శైలితో తెలుగు సినిమా రంగంలో ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారు. సంప్రదాయ దర్శకత్వ రూల్స్‌ను బ్రేక్ చేస్తూ, తనదైన స్టైల్‌తో ట్రెండ్ సెట్ చేసిన డైరెక్టర్ గా నిలిచారు. ప్రస్తుతం ఆయన పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తో ‘స్పిరిట్’ అనే భారీ సినిమా చేస్తున్నారు.
Prabhas Agrees to Sandeep Reddy Vanga Conditions
ఈ సినిమాలో ప్రభాస్ తొలిసారి పోలీస్ పాత్రలో కనిపించనున్నారు. ఈ చిత్రం కోసం సందీప్ ప్రభాస్‌కు కొన్ని కఠినమైన షరతులు పెట్టినట్లు సమాచారం. సినిమాకు సంబంధించిన లుక్ మార్చకూడదని, సినిమా పూర్తయ్యే వరకు ఇతర సినిమాల్లో నటించొద్దని, పబ్లిక్‌లో ఎక్కువగా కనిపించకూడదని చెప్పినట్లు తెలుస్తోంది. అంతేకాదు, ప్రతి సీన్లో డూప్ లేకుండా నటించాలని కూడా సందీప్ కోరాడట.
సందీప్ పెట్టిన ఈ కఠినమైన షరతులకు ప్రభాస్ ఓకే చెప్పడం గమనార్హం. ఎందుకంటే సందీప్ దర్శకత్వంలో సినిమా చేయడం తన కెరీర్ కు మరింత బలాన్ని ఇస్తుందని ప్రభాస్ భావిస్తున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ప్రభాస్ ‘రాజాసాబ్’, ‘ఫౌజీ’ సినిమాల్లో బిజీగా ఉన్నారు. ఈ రెండు సినిమాల తర్వాత ‘స్పిరిట్’ షూటింగ్ ప్రారంభం కానుంది. ఫ్యాన్స్ మాత్రం పోలీస్ గెటప్‌లో ప్రభాస్ ఎలా కనిపిస్తాడో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ‘స్పిరిట్’ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సందీప్ రెడ్డి వంగా మార్క్ మాస్ ఎంటర్టైన్మెంట్తో సినిమా తెరపై అలరించనుందని ఫ్యాన్స్ విశ్వాసం వ్యక్తం చేస్తున్నారు.