Prabhas: ఆ హీరోయిన్ వల్లే నేను జాతకాలు నమ్మాను.?
Prabhas: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కి జాతకాలు నమ్మడం అంటే అసలు ఇష్టం ఉండదని చాలా రోజులుగా వినిపిస్తున్న టాక్. కానీ బాహుబలి సినిమా తర్వాత ప్రభాస్ కూడా జాతకాలు నమ్మడం మొదలు పెట్టారట. అది కూడా ఓ హీరోయిన్ కారణంగా ..మరి ఇంతకీ ఏ హీరోయిన్ ని చూసి ప్రభాస్ జాతకాలు నమ్మడం మొదలెట్టారు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రభాస్ జాతకాలు నమ్మడానికి ప్రధాన కారణం కంగనా రనౌత్ అట.. బాలీవుడ్ నటి కంగనా రనౌత్ ప్రభాస్ కాంబినేషన్లో ఏక్ నిరంజన్ సినిమా వచ్చిన సంగతి మనకు తెలిసిందే.
Prabhas: Because of that heroine I believed in horoscopes
అయితే ఈ సినిమా అంతగా ఆడక పోవడంతో కంగనా మళ్లీ బాలీవుడ్ కి వెళ్ళిపోయింది. ఇక బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ లో ఒకరైన కంగనా రనౌత్ రీసెంట్గా బిజెపి తరపున ఎంపీ ఎలక్షన్స్ లో గెలిచి ఎంపి కూడా అయింది. అయితే అలాంటి ఈ ముద్దుగుమ్మ కారణంగానే ప్రభాస్ జాతకాలు నమ్మడం మొదలు పెట్టారట.అయితే ఏక్ నిరంజన్ సినిమా షూటింగ్ సమయంలో కంగనా రనౌత్ తన ఫ్యామిలీ బ్యాగ్రౌండ్ మొత్తం ప్రభాస్ కి చెప్పిందట.(Prabhas)
Also Read: Prabhas: అర్ధరాత్రి ఆ హీరోయిన్ ప్రభాస్ టార్చర్ చేశారా.?
నేను చిన్న ఫ్యామిలీ నుండి వచ్చాను.నాకు అసలు సినిమాలు అంటేనే తెలియదు. మొదటిసారి నేను కేరళ వచ్చినప్పుడు ఓ జ్యోతిష్యుడు నన్ను చూసి నువ్వు సినిమాలో పెద్ద స్టార్ అవుతావని చెప్పాడు. కానీ నేను ఆయన మాటలల్ని నమ్మలేదు. కానీ ఆయన చెప్పినట్లే నాకు సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా నాకు సినిమాల్లో అవకాశం రావడం నాకే షాకింగ్ గా అనిపించింది.
అందుకే అప్పటినుండి జాతకాలు జ్యోతిష్యం నమ్మడం మొదలు పెట్టాను అంటూ కంగనా చెప్పుకొచ్చిందట. అయితే ఈ విషయాన్ని చెబుతూ నేను కూడా ఒకప్పుడు జ్యోతిష్యాన్ని నమ్మకపోయేవాడిని కానీ కంగనా చెప్పిన మాటలు విన్నాక బాహుబలి సినిమా తర్వాత నుండి నేను కూడా ఈ జ్యోతిష్యం జాతకాలు వంటి వాటిని నమ్మడం మొదలుపెట్టాను అంటూ ప్రభాస్ చెప్పుకొచ్చారు.(Prabhas)