Prabhas: డైరెక్టర్ తో ప్రభాస్ గొడవలు.. ది రాజా సాబ్ రిలీజ్ కష్టమేనా.?
Prabhas: ప్రభాస్ దేశవ్యాప్తంగా ఎంతో గుర్తింపు పొందిన హీరో.. ఈయన గుర్తింపు పొందడమే కాకుండా తెలుగు సినిమా ఇండస్ట్రీ ఖ్యాతిని కూడా ఎక్కడికో తీసుకెళ్లాడని చెప్పవచ్చు. అలాంటి ప్రభాస్ తో సినిమా అంటే డైరెక్టర్లకు ఎంతో టాలెంట్ ఉండాలి. ఎందుకంటే ప్రభాస్ హీరోగా సినిమా వస్తుంది అంటే అభిమానులు ఎన్నో అంచనాలు పెట్టుకుంటారు. అందుకే ప్రభాస్ తో సినిమా చేసేవారు తప్పకుండా టాలెంటెడ్ డైరెక్టర్ అయి ఉంటేనే ఆ సినిమా హిట్ అవుతుందని చెప్పవచ్చు.

Prabhas quarrel with the director Is the release of The Raja Saab difficult
ఇంతటి పేరున్నటువంటి ప్రభాస్ తో డైరెక్టర్ మారుతి సినిమా తీస్తున్న విషయం అందరికీ తెలిసిందే.. దానిపేరే ది రాజా సాబ్. ఇప్పటికే ఈ సినిమా నుంచి పోస్టర్, టీజర్ రిలీజ్ అయి అభిమానులను ఆకట్టుకున్నాయి.. అయితే మారుతి చిన్న డైరెక్టర్ కావడంతో ఆయనకు ప్రభాస్ చాన్స్ ఇవ్వడంతో చాలామంది ఆశ్చర్యపోయారు. అంత చిన్న డైరెక్టర్ తో సినిమా తీస్తున్నారు ఆయన అభిమానులు ఒప్పుకుంటారా..సినిమా ఎలా ఉంటుందో అని అనుమానం వ్యక్తం చేశారు.. (Prabhas)
Also Read: The Paradise: “ది ప్యారడైజ్” లో నాని రెండు జడల వెనుక ఆ డైరెక్టర్ నిజ జీవితం దాగి ఉందా.?
అభిమానుల అనుమానం ప్రకారమే సినిమా పూర్తి డల్ గా తీసినట్టు తెలుస్తోంది. సినిమా అవుట్ పుట్ చూసినటువంటి ప్రభాస్ డైరెక్టర్ పై తీవ్రంగా విరుచుకు పడ్డారట. సినిమాలోని 80% షూటింగ్ మళ్లీ తీయాలని అన్నారట.. పీపుల్స్ మీడియా బ్యానర్ పై తెరకెక్కుతున్న ది రాజా సాబ్ మూవీకి దర్శక నిర్మాతలు కూడా భారీగా ఖర్చు పెడుతున్నారు. వారి ఖర్చుకు తగ్గట్టుగా సినిమా గ్రాఫిక్స్,విజువల్స్ రాలేదని ప్రభాస్ డైరెక్టర్ పై మండిపడ్డట్టు తెలుస్తోంది..

మీరు సినిమా ఇలా తీస్తే నా అభిమానులు ఒప్పుకుంటారా, మళ్లీ సినిమాను రీ షూట్ చేయండి అంటూ చెప్పుకొచ్చారట.. ఈ విధంగా ప్రభాస్ ది రాజా సాబ్ త్వరలో వస్తుందని అందరు అనుకున్నారు. కానీ డైరెక్టర్ చేసిన పనికి ఈ సినిమా మళ్లీ వాయిదా పడే అవకాశం ఉందని తెలుస్తోంది. మరి ఇందులో ఎంతవరకు నిజం ఉందో అబద్ధం ఉందో తెలియదు కానీ సోషల్ మీడియాలో మాత్రం ఈ వార్తలు విపరీతంగా వైరల్ అవుతున్నాయి. దీని గురించి అసలు విషయం బయటకు వస్తే కానీ క్లారిటీ రాదు.(Prabhas)