Prabhas Spirit: ప్రభాస్ సందీప్ సినిమా ను పక్కన పెట్టాడా? రూల్స్ మరీ ఎక్కువయ్యాయి.. అందుకే ఇలా?

Prabhas Spirit: ప్రస్తుతం టాలీవుడ్‌లో అత్యంత బిజీగా ఉన్న హీరో ఎవరు అంటే ప్రభాస్ పేరు ముందే వస్తుంది. మిగతా హీరోలు ఒకటి రెండు సినిమాలతోనే గడిపేస్తే, ప్రభాస్ మాత్రం ఐదు లేదా ఆరు సినిమాలను లైన్‌లో పెట్టుకుని పని చేస్తున్నాడు. ప్రస్తుతం ఆయన ‘ది రాజా సాబ్’, ‘ఫౌజీ’ వంటి చిత్రాల్లో నటిస్తుండగా, ‘యానిమల్’ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘స్పిరిట్’ అనే భారీ సినిమా చేయనున్నారు. ఈ సినిమా కోసం అభిమానులు చాలా కాలంగా ఎదురుచూస్తున్నారు.
Prabhas Spirit movie shoot delayed
ప్రభాస్ ‘స్పిరిట్’ సినిమాలో పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించనున్నారని సమాచారం. సందీప్ వంగా ఈ సినిమాకి కథ రాయడానికి ఏకంగా ఎనిమిది నెలల సమయం తీసుకున్నారట. ఆ తర్వాత స్క్రీన్‌ప్లే కోసం మరో ఆరు నెలలు కేటాయించారు. ప్రస్తుతం ఆయన కథతో పాటు క్యాస్టింగ్ పనుల మీద దృష్టి పెట్టారు. ఈ ప్రాజెక్ట్‌లో కొరియన్, అమెరికన్ నటులు కూడా కనిపించనున్నారని సమాచారం. ఇది పూర్తిగా పాన్-వరల్డ్ సినిమాగా రూపొందనున్నది.
అంతేగాక, ప్రభాస్ ఈ సినిమా కోసం ప్రత్యేకమైన డైట్ ఫాలో అవుతున్నట్లు టాక్. పోలీస్ లుక్‌లో ఫిట్‌గా కనిపించేందుకు కొంత గ్యాప్ తీసుకుని బరువు తగ్గే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ‘స్పిరిట్’ సినిమా జూన్‌లో సెట్స్‌పైకి వెళ్లదని, సెప్టెంబర్ లేదా అక్టోబర్‌లో షూటింగ్ ప్రారంభమయ్యే అవకాశం ఉందని ఫిల్మ్ నగర్ వర్గాలు చెబుతున్నాయి. ఇప్పటివరకు ఈ విషయమై ఎటువంటి అధికారిక ప్రకటన రాలేదు.
ఇక విడుదల విషయానికి వస్తే, ‘స్పిరిట్’ 2027లో ప్రేక్షకుల ముందుకు రావచ్చని అంచనాలు ఉన్నాయి. ఈలోగా ప్రభాస్ చేతిలో ఉన్న ‘సలార్ 2’, ‘కల్కి 2’, హను రాఘవపూడితో చేయబోయే యాక్షన్ డ్రామా వంటి సినిమాల షెడ్యూల్ కూడా ఉంది. అయినా అభిమానుల్లో మాత్రం ‘స్పిరిట్’ పైనే ప్రత్యేక ఆసక్తి ఉంది. ‘అర్జున్ రెడ్డి’, ‘యానిమల్’ వంటి డిఫరెంట్ కథలతో సెన్సేషన్ సృష్టించిన సందీప్ వంగా, ప్రభాస్‌ను ఎలా చూపించబోతున్నాడన్నది ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారింది.