Prashanth Varma: ఆ హీరోతో చెంప దెబ్బ తిన్న ప్రశాంత్ వర్మ.. నిజమేనా..?

Prashanth Varma: నందమూరి బాలకృష్ణ ఈయన ఎంత కోపంగా ఉంటారో అంత మంచి వ్యక్తి. ఆయనకు నచ్చినట్టు వ్యక్తి బిహేవ్ చేస్తే వాళ్లని ఎంతో ఆరాధిస్తాడు. ఒకవేళ పిచ్చి పిచ్చి పనులు చేసి నచ్చకుంటే మాత్రం డైరెక్ట్ గా తిట్టడం, కొట్టడం వంటివి చేస్తాడు. అలా అలా బాలకృష్ణ మెచ్చిన ఒక డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.. తన సొంత కొడుకు మోక్షజ్ఞ ఇండస్ట్రీకి మొదటి సినిమాను అందించే బాధ్యత ప్రశాంత్ వర్మపై పెట్టాడు. అంతేకాకుండా పురాణా, ఇతిహాసాలకు సంబంధించిన కథ కూడా రెడీ చేసి బాలయ్యకు వినిపించాడట.

Prashanth Varma who got slapped by that hero is it true

Prashanth Varma who got slapped by that hero is it true

ఈ కథ కూడా ఆయనకు బాగా నచ్చిందని, ఈ డిసెంబర్ ఐదవ తేదీన ముహూర్తం కుదిరి షూటింగ్ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇంతలో ఏం జరిగిందో ఏమో ఈ కార్యక్రమం వాయిదా పడింది. దీనికి కారణం డైరెక్టర్ ప్రశాంత్ వర్మ అని తెలుస్తోంది. హనుమాన్ సినిమా హిట్ అయిన తర్వాత ప్రశాంత్ వర్మకు కాస్త పొగరు పెరిగిందట. పూర్తిగా కమర్షియల్ డైరెక్టర్ గా మారిపోయారట. ఆయనకి ఎంత డబ్బున్న ఎంత టాలెంట్ ఉన్నా కానీ బాలకృష్ణ లాంటి సీనియర్ ముందు ఆ పొగరు చూపిస్తే ఆయన ఊరుకోరు.(Prashanth Varma)

Also Read: Keerthy Suresh Wedding: ఘనంగా హీరోయిన్ కీర్తీ సురేష్ పెళ్లి.. వైరల్ అవుతున్న ఫోటోలు!!

కానీ ప్రశాంత్ వర్మ బాలకృష్ణ ముందు కూడా ఆ విధంగానే పొగరు చూపించారట. అన్ స్టాపబుల్ షో ట్రైలర్ కట్ చేయమని ఆహా టీం అడిగితే డబ్బులు ఎక్కువగా అడిగాడట, అంతేకాకుండా మోక్షజ్ఞతో సినిమా విషయంలో కూడా బాలయ్యకు చావు కబురు చల్లగా చెప్పాడట. కథను నేను రెడీ చేస్తాను దర్శకత్వం మాత్రం తన అసిస్టెంట్ చేస్తారని చెప్పడంతో విపరీతంగా కోపానికి వచ్చిన బాలయ్య వర్మకు రెండు ఇచ్చాడని తెలుస్తోంది..

Prashanth Varma who got slapped by that hero is it true

నాలుగు నెలల పాటు ఎంతో శ్రద్ధగా తయారు చేసిన కథను అసిస్టెంట్ తో చేయిస్తావా అంటూ కోప్పడ్డాడ.. అయితే బాలకృష్ణ కోపం వెనుక ఒక మంచి విషయం ఉంది. తన కొడుకు మొదటిసారి ఎంట్రీ ఇస్తున్నాడు కాబట్టి అద్భుతంగా సినిమా ఉండాలి అనుకున్నాడు. కానీ చివరికి ప్రశాంత్ వర్మ తన అసిస్టెంట్ తో సినిమా తీస్తా అనేసరికి కోపానికి వచ్చి చెంప చెల్లుమనిపించాడని తెలుస్తోంది..(Prashanth Varma)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *