కొత్తదనాన్ని ఇష్టపడే వర్సటైల్ యాక్టర్ ఆర్. మాధవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న మోస్ట్ అవేటెడ్ బయోపిక్ ‘జి.డి. నాయుడు’ (GDN). నటుడు, దర్శకుడు కృష్ణకుమార్ రామకుమార్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ఈ మూవీ నేడు ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా థియేట్రికల్ రిలీజ్ అయింది. ‘ఎడిసన్ ఆఫ్ ఇండియా’, ‘మిరాకిల్ మేన్’ అని పేరుగాంచిన ప్రముఖ భారతీయ శాస్త్రవేత్త గోపాలస్వామి దొరైస్వామి నాయుడు స్ఫూర్తిదాయక జీవిత కథ ఆధారంగా ఈ చిత్రం రూపొందింది. ఆయన బహుముఖ ప్రజ్ఞను వెండితెరపై ఆవిష్కరించే పాత్రలో మాధవన్ జీవించేశారని క్రిటిక్స్ చెబుతున్నారు.
ఈ చిత్రంలో సత్యరాజ్, జయరామ్, ప్రియమణి, దుషారా విజయన్ మరియు వినయ్ రాయ్ వంటి ప్రముఖ నటులు కీలక రోల్స్ చేశారు. గతంలో నంబి నారాయణన్ బయోపిక్ ‘రాకెట్రి’ తో అద్భుతమైన సక్సెస్ అందుకున్న మాధవన్, ఈ సినిమా కోసం పూర్తిగా మేకోవర్ అయ్యారు. సహజమైన పీరియాడికల్ సెటప్, రిచ్ ప్రొడక్షన్ వాల్యూస్ ఈ సినిమాపై భారీ అంచనాలను పెంచేశాయి.
గోవింద్ వసంత్ అందించిన బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ప్రతి సన్నివేశాన్ని అద్భుతంగా ఎలివేట్ చేసింది. ఇటీవల విడుదలైన తెలుగు ట్రైలర్‌కు ప్రేక్షకులు మరియు సినీ విశ్లేషకుల నుంచి రికార్డ్ స్థాయి రెస్పాన్స్ లభించింది. భారతీయ సాంకేతిక రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చిన ఒక మహానాయకుడి ప్రయాణాన్ని థియేటర్లలో చూసేందుకు ఆడియన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
వర్గీస్ మూలన్ పిక్చర్స్, ట్రై కలర్ పిక్చర్స్ పతాకాలపై తెరకెక్కిన ఈ చిత్రానికి నిర్మాతలుగా వర్గీస్ మూలన్, విజయ్ మూలన్, ఆర్. మాధవన్, సరిత మాధవన్ వ్యవహరించారు. అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొందిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఎలాంటి విజయం సాధిస్తుందో చూడాలి.





