చిరును ఫాలో అవుతున్న రజినీ

ప్రస్తుతం చిరంజీవి బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తున్నాడు. కోలీవుడ్ స్టార్ రజినీకాంత్ కూడా చిరు బాటలోనే వెళ్తూ గ్యాప్ లేకుండా సినిమాల్లో నటిస్తున్నాడు. ప్రస్తుతం రజినీకాంత్ నెల్సన్ దిలీప్ కుమార్ డైరెక్షన్ లో జైలర్ 2 చేస్తున్నాడు. కూలీ రిలీజ్ తర్వాత నుంచి జైలర్ 2 షూటింగ్ లో స్పీడు పెంచనున్నారు. ఈ సూపర్ స్టార్ తాజాగా మరో కథకు ఓకే చెప్పాడని టాక్ వినిపిస్తోంది.

మరోవైపు రజినీ కోసం ఇతర దర్శకులు కథలు రెడీ చేస్తున్నారు. వారిలో తెలుగు దర్శకులు వివేక్ ఆత్రేయ, బాబీ, మలినేని గోపీచంద్ వంటి వారు కూడా ఉన్నారు. అయితే తాజాగా డైరెక్టర్ కమ్ యాక్టర్ శశికుమార్ ఇటీవల టూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్నాడు. ఆయన రజినీ కోసం స్టోరీ రెడీ చేశాడని, ఈ కథను రజినీకి చెబితే వెంటనే ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. జైలర్ 2 తర్వాత ఈ సినిమానే ఉంటుందని కోలీవుడ్ మీడియా పేర్కొంటోంది.

Share your love