Ram Charan: రామ్ చరణ్ ‘పెద్ది’ కథ ఇదేనా? సినిమాలో షాకింగ్ ట్విస్ట్?

Ram Charan: ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమ ఎదురుచూస్తున్న మోస్ట్ అవేటెడ్ మూవీ ‘పెద్ది’ (Peddi). సంక్రాంతి సీజన్ తర్వాత బాక్సాఫీస్ వద్ద సరైన కమర్షియల్ హిట్ లేక థియేటర్లు వెలవెలబోతున్నాయి. ఈ గ్యాప్‌ను భర్తీ చేస్తూ, ప్రేక్షకుల్లో మళ్ళీ ఉత్సాహాన్ని నింపడానికి రామ్ చరణ్ సిద్ధమవుతున్నారు. బుచ్చిబాబు సన దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. ఇప్పటికే రెండు సార్లు వాయిదా పడినప్పటికీ, ఈసారి మాత్రం పక్కాగా బరిలోకి దిగుతున్నట్లు చిత్ర బృందం స్పష్టం చేసింది.

Ram Charan Peddi Movie Trailer Date

సినిమా ప్రమోషన్ల విషయంలో మైత్రీ మూవీ మేకర్స్ (Mythri Movie Makers) అగ్రస్థానంలో ఉంటారు. ఈ నెల మూడో వారం నుండి రామ్ చరణ్ స్వయంగా ప్రచార బరిలోకి దిగనున్నారు. కేవలం ఈవెంట్లు మాత్రమే కాకుండా, ప్రేక్షకులను కథలోకి తీసుకెళ్లేలా పవర్‌ఫుల్ కంటెంట్‌ను విడుదల చేయాలని టీమ్ భావిస్తోంది. ముఖ్యంగా సుకుమార్ (Sukumar) స్వయంగా ట్రైలర్ కట్ విషయంలో ఇన్వాల్వ్ అవ్వడం సినిమాపై హైప్‌ను మరింత పెంచింది. ఇప్పటి వరకు విడుదలైన ప్రోమోల్లో చరణ్ లుక్ మరియు సెటప్ ఆకట్టుకున్నా, కథ విషయంలో మేకర్స్ గోప్యత పాటిస్తున్నారు.

గ్లింప్స్ లో చరణ్‌ను క్రికెట్ ఆడే అల్లరి కుర్రాడిగా చూపించి, తర్వాత ప్రోమోలో కుస్తీ యోధుడిగా (Wrestler) ప్రెజెంట్ చేయడం వెనుక ఉన్న ట్రాన్స్‌ఫర్మేషన్ ఆసక్తికరంగా ఉంది. ఈ కథ మొత్తం ఒక గుర్తింపు లేని ఊరిని కాపాడుకునే యువకుడి చుట్టూ తిరుగుతుందని సమాచారం. సినిమాలో ఒక భారీ ట్విస్ట్ (Hidden twist) ఉందని, అది ప్రేక్షకులను షాక్‌కు గురి చేస్తుందని ట్రేడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ సర్ప్రైజ్‌ను ట్రైలర్ లోనే రివీల్ చేస్తారా లేదా అన్నది చూడాలి.

సినిమాలో జానవీ కపూర్ (Janhvi Kapoor) హీరోయిన్‌గా నటిస్తుండగా, ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. ‘ఉప్పెన’ వంటి భారీ విజయం తర్వాత బుచ్చిబాబు చేస్తున్న సినిమా కావడంతో విలేజ్ డ్రామా మరియు ఎమోషన్స్ మరో స్థాయిలో ఉంటాయని భావిస్తున్నారు. ఈ వేసవికి ‘పెద్ది’ ఒక సాలిడ్ ట్రీట్ కావడం ఖాయంగా కనిపిస్తోంది.