Ram Charan Role: ఆసక్తి కరంగా రామ్ చరణ్ లుక్.. పెద్ది కోసం పెద్ద స్కెచ్చె వేశారుగా!!

Ram Charan Role: మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న తాజా చిత్రం ‘పెద్ది’. ‘గేమ్ ఛేంజర్’ తర్వాత వస్తున్న ఈ సినిమా ప్రేక్షకుల్లో భారీ అంచనాలను రేకెత్తిస్తోంది. ఇటీవల విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ అభిమానులను ఆకట్టుకోగా, రామ్ చరణ్ ఊర మాస్ లుక్‌లో బ్యాట్ పట్టుకుని కనిపించాడు. ఈ పోస్టర్ సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో పెద్ది కథలో కొత్తదనం ఏంటి? అనే చర్చ మొదలైంది.
Ram Charan Role in Peddi Explained
ఈ సినిమాలో రామ్ చరణ్ మరుగుజ్జుగా కనిపించనున్నాడా? అనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఫస్ట్ లుక్‌లో చరణ్ చేయి చిన్నగా కనిపించడం, కథకు ఆసక్తికరమైన మలుపు ఇచ్చేలా ఉందని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. దర్శకుడు బుచ్చిబాబు సానా తన సినిమాల్లో హీరోలకు ప్రత్యేకమైన లక్షణం లేదా లోపం ఇస్తారని చెబుతున్నారు. ‘ఉప్పెన’లో హీరో పాత్రకు డిఫరెంట్ షేడ్ ఇచ్చిన బుచ్చిబాబు, పెద్దిలో రామ్ చరణ్ క్యారెక్టర్‌కు కూడా నూతన కోణాన్ని తీసుకువచ్చాడని టాక్.
శ్రీరామనవమి సందర్భంగా పెద్ది గ్లింప్స్ విడుదల కానుండటంతో దీనిపై మరింత స్పష్టత రానుంది. ఇది గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కిన స్పోర్ట్స్ డ్రామా, ఇందులో జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తుండగా, శివ రాజ్‌కుమార్, జగపతిబాబు, దివ్యేందు శర్మ వంటి స్టార్ క్యాస్ట్ ఉంది.
ఈ సినిమాకు ఏఆర్ రెహమాన్ సంగీతం, మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కుతున్న పెద్ది పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది.