Ramayana: సీతాపహరణమా, మరో కొత్త ట్విస్టా? రామాయణం పార్ట్‑1 క్లైమాక్స్‌పై వివాదం

రామాయణం సినిమా విషయంలో తాజా న్యూస్ ఏంటంటే, దర్శకుడు నితీష్ తివారీ ఇచ్చిన ఇంటర్వ్యూ వైరల్ అయింది. రణ్బీర్ కపూర్ రాముడిగా, సాయి పల్లవి సీతగా నటిస్తున్న ఈ మూవీని రెండు పార్ట్లలో విడుదల చేస్తారు. పార్ట్ 1 ఈ దీపావళికి, పార్ట్ 2 వచ్చే దీపావళికి రిలీజ్ కానుంది. కానీ డైరెక్టర్ మాట్లాడుతూ పార్ట్ 1 ఒక పెద్ద క్లిఫ్హ్యాంగర్ ట్విస్ట్ తో ఎండ్ అవుతుంది అని చెప్పడంతో నెటిజన్లు సీరియస్ గా రియాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే రామాయణం కథ అందరికీ తెలుసు, ఇక్కడ ట్విస్ట్ కి స్కోప్ లేదు అని వారి వాదన.

Ramayana Cliffhanger Twist Controversy

సినిమా ప్రమోషన్లో భాగంగా నితీష్ తివారీ ఒక హాలీవుడ్ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ కామెంట్ చేశారు. పార్ట్ 1 చూసిన ప్రేక్షకులు వెంటనే పార్ట్ 2 కోసం ఎదురుచూసేలా ఒక ట్విస్ట్ ఉంటుంది అని అన్నారు. ఇది విన్న వెంటనే నెటిజన్లు ఫుల్ స్పీడ్లో రియాక్ట్ అయ్యారు. బాహుబలి లాంటి ఫిక్షన్ కథలో ట్విస్ట్ పని చేస్తుంది, కానీ రామాయణం ఐతిహాసిక కథ, అది ఇప్పటికే అందరికి తెలుసు. ఇక్కడ ట్విస్ట్ ఏంటి అని ప్రశ్నలు వేస్తున్నారు. కొంతమంది ఆదిపురుష్ లాగా మళ్లీ ట్రోల్ అవుతామేమో అని ఫియర్ అవుతున్నారు.

నెటిజన్లు కామెంట్ చేస్తున్నది చూస్తే, రామాయణం కథ దశరథ మహారాజు నుంచి రావణుడి వధ వరకు అందరికీ తెలుసు. ఈ స్టోరీలో కొత్తగా ఏం చూపిస్తారు? పార్ట్ 1 లో ఏమి ట్విస్ట్ ఉంటుంది? లంకాదహనం? లేదంటే సీతాపహరణం? ఇవన్నీ కూడా ఇప్పటికే ఎన్నో సినిమాల్లో చూశాం. అందుకే డైరెక్టర్ మాటలు అర్థం కావడం లేదు అని ట్విట్టర్ లో, ఇన్స్టాగ్రామ్ లో ట్రోల్ చేస్తున్నారు. కొంతమంది మేమ్స్ కూడా పెడుతున్నారు. కొత్తగా ఏదైనా చూపిస్తే ఫుల్ ఫన్ అవుతుంది, లేదంటే మాత్రం ట్రోల్ వేటు ఖాయమని ఫ్యాన్స్ అంటున్నారు.

ఇక ఈ సినిమా కాస్ట్ చూస్తే, అరుణ్ గోవిల్ దశరథుడిగా, శోభన కైకేయిగా, అజింక్య దేవ్ విశ్వామిత్రగా, కునాల్ కపూర్ ఇంద్రుడిగా, రకుల్ ప్రీత్ సింగ్ శూర్పణఖగా, రవి దూబే లక్ష్మణుడిగా, సన్నీ డియోల్ హనుమంతుడుగా నటిస్తున్నారు. ట్రైలర్ త్వరలోనే రిలీజ్ కానుంది. మరి ఈ రామాయణం సినిమాలో నిజంగా ఏం ట్విస్ట్ ఉంటుందో, దర్శకుడి విజన్ ఎలా ఉంటుందో సినిమా వచ్చిన తర్వాతే తెలియాలి. ప్రస్తుతానికి నెటిజన్లు మాత్రం డైరెక్టర్ ని ట్రోల్ చేస్తూ మేమ్స్ తో ఎంజాయ్ అవుతున్నారు.

https://x.com/pakkafilmy007/status/1600352362639822848

Share your love