Ramayana: రణభీర్ కపూర్ రామాయణ ట్రైలర్ వాయిదా? ఎందుకంటే?

Ramayana

రామాయణ ట్రైలర్ రిలీజ్‌లో డిలే ఆయింది. నితీష్ తివారీ డైరెక్షన్‌లో వస్తున్న ఈ మల్టీస్టారర్‌లో రణబీర్ కపూర్, సాయి పల్లవి, యశ్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. ముందుగా అనుకున్న డేట్‌కు బదులు కొత్త తేదీలో ఈ ట్రైలర్ రిలీజ్ చేస్తారట.

Ramayana Trailer Delay News

రామాయణ ట్రైలర్‌ని మీడియాకి ప్రైవేట్‌గా చూపించారు. దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. అయితే పబ్లిక్ రిలీజ్‌ని కాస్త ఆలస్యం చేయాలని నిర్ణయించారు. టైమింగ్‌ని మరింత పెర్ఫెక్ట్ చేయడానికి, గ్రాండ్‌గా లాంచ్ చేద్దామని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. కొత్త డేట్‌ని త్వరలోనే అనౌన్స్ చేస్తామని చెప్పారు.

అదే టైమ్‌లో మరో షాకింగ్ అప్‌డేట్ వచ్చింది. ‘రామాయణ’ మూవీ సోనీ పిక్చర్స్‌తో గ్లోబల్ పార్టనర్ షిప్ చేసుకుంది. హాలీవుడ్‌లో టాప్ స్టూడియో అయిన సోనీ ఈ ఫిల్మ్‌ని వరల్డ్‌వైడ్ డిస్ట్రిబ్యూట్ చేస్తుంది. ఈ భాగస్వామ్యంతో భారతీయ పురాణాన్ని ఇంటర్నేషనల్‌గా ప్రమోట్ చేయడానికి పెద్ద అవకాశం దొరికింది.

యూత్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఈ సినిమాకి ట్రైలర్ డిలే అయినా, సోనీ డిల్ న్యూస్ వలన ఫ్యాన్స్‌లో ఎక్కువ ఎక్సైట్ మెంట్ వచ్చింది. ఇప్పుడు అందరి ఫోకస్ కొత్త ట్రైలర్ రిలీజ్ డేట్ మీదే ఉంది. మేకర్స్ త్వరలోనే పూర్తి డీటెయిల్స్ షేర్ చేస్తారని టాక్.

Share your love
PakkaFilmy Telugu

PakkaFilmy Telugu