Ranbir Kapoor: బీఫ్ తినేవాడు రాముడిగా.. రణబీర్ కపూర్ పై సద్గురు షాకింగ్ కామెంట్స్.!

Sadhguru shocking comments on Ranbir Kapoor

Ranbir Kapoor: రణబీర్ కపూర్ బాలీవుడ్ రామాయణ ప్రాజెక్టులో రాముడిగా చేస్తున్న సంగతి మనకు తెలిసిందే.అయితే ఎప్పుడైతే రణబీర్ కపూర్ ని రాముడి పాత్రలో తీసుకోబోతున్నట్టు చిత్ర యూనిట్ ప్రకటించిందో అప్పటినుండి రణబీర్ కపూర్ అంటే పడని వాళ్ళు ఆయనపై చాలా విమర్శలు చేస్తున్నారు. లిప్ లాక్ సీన్స్, బోల్డ్ సన్నివేశాల్లో నటిస్తూ, బీఫ్ తినే వాడితో రాముడి పాత్ర వేయించడం ఏంటో అని మండిపడ్డారు. కానీ డైరెక్టర్ మాత్రం రాముడి పాత్రకి పర్ఫెక్ట్ ఛాయిస్ రణబీర్ కపూర్ మాత్రమే అంటూ చాలా సందర్భాల్లో చెప్పారు.

Sadhguru shocking comments on Ranbir Kapoor

ఈ నేపథ్యంలోనే తాజాగా ఈషా ఫౌండేషన్ చైర్మన్ అయినటువంటి సద్గురు జగ్గీ వాసుదేవ్ రాముడి పాత్ర పై వస్తున్న విమర్శలపై సంచలన వ్యాఖ్యలు చేశారు. తాజాగా రామాయణ మూవీని నిర్మిస్తున్న నమిత్ మల్హోత్రా కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సద్గురు మాట్లాడుతూ.. ఒకప్పుడు వేరే పాత్రల్లో చేశారని ఇప్పుడు రాముడి పాత్రలో ఎలా చేస్తారని రణబీర్ కపూర్ ని విమర్శించడం చాలా అన్యాయం. ఆయన మొదట సినిమాలు చేసినప్పుడు తెలియదు కదా..(Ranbir Kapoor)

Also Read: Prabhas: ప్రభాస్ ఇన్ని రోజులు కాపాడుకున్న పరువును గంగలో కలుపుతున్న డైరెక్టర్.. న్యూ**గా చూపిస్తూ.?

నెక్స్ట్ రాముడి పాత్రలో నటిస్తాడని..ఒకవేళ ఆయనకు ముందే తెలిసి ఉంటే అలాంటి పాత్రను ఒప్పుకునే వారు కాకపోవచ్చు. అలాగే ఇప్పుడు రాముడి పాత్రలో చేస్తున్నాడు నెక్స్ట్ రవణుడి పాత్రలో చేస్తాడు కావచ్చు. అలాంటప్పుడు కూడా మీరు విమర్శలు చేస్తారా.. అయినా రణబీర్ కపూర్ రాముడి పాత్రలో చేస్తే ట్రోల్స్ చేయడం చాలా అన్యాయం.. అంటూ రణబీర్ కపూర్ పై విమర్శలు చేసే వారికి కౌంటర్ ఇచ్చారు సద్గురు.

Sadhguru shocking comments on Ranbir Kapoor

ఇక సద్గురు మాట్లాడిన మాటలు నెట్టింట వైరల్ గా మారడంతో సద్గురు చెప్పిన మాటలతో నైనా రణబీర్ కపూర్ పై విమర్శలు చేసే వారు రియలైజ్ అవ్వండి.. పాత్రలో వాళ్ళు ఎంత బాగా చేస్తారు అని చూడాలి. కానీ ముందు అలాంటి సీన్స్ చేశారు ఇప్పుడు దేవుడి పాత్రలో ఎలా నటిస్తారని విమర్శించడం మానేయండి. యాక్టర్ అన్నప్పుడు అన్ని పాత్రల్లో చేయగలగాలి.అది ముందుగా తెలుసుకోండి అంటూ రణబీర్ ఫ్యాన్స్ కౌంటర్ ఇస్తున్నారు.(Ranbir Kapoor)

Share your love