Alia Bhatt: అలియా భట్ పై ప్రతీకారం తీర్చుకున్న రణబీర్.?

Ranbir took revenge on Alia Bhatt
 Ranbir took revenge on Alia Bhatt

Alia Bhatt: అలియా భట్ పై భర్త రణబీర్ కపూర్ ప్రతీకారం తీర్చుకోవడమా..ఇంతకీ వీళ్లిద్దరి మధ్య జరిగిన గొడవ ఏంటి..ఎందుకు భార్యపై రణ్బీర్ కపూర్ ప్రతీకారం తీర్చుకున్నాడు అనేది ఇప్పుడు చూద్దాం. ప్రస్తుతం గోవాలో 2024ఇఫీ అవార్డ్స్ ఈవెంట్ జరుగుతున్న సంగతి మనకు తెలిసిందే.ఇఫీ అవార్డ్స్ ఈవెంట్లో ఎంతో మంది నార్త్, సౌత్ సెలబ్రిటీలు పాల్గొన్నారు. అయితే తాజాగా రన్బీర్ కపూర్ అలియాభట్ లు కూడా ఈ ఈవెంట్లో పాల్గొన్నారు.

Ranbir took revenge on Alia Bhatt

అయితే స్టేజ్ పై రన్బీర్ కపూర్ తన భార్య ఆలియా భట్ గురించి మాట్లాడుతూ.. నేను ఆలీయా ని మొదట కలిసిన సమయంలో ఆమె చాలా అమాయకంగా నాతో మాట్లాడుతూ ఇంతకీ ఈ కిషోర్ కుమార్ ఎవరు అంటూ నన్ను ప్రశ్నించింది.అయితే ఆ సమయంలో ఆమె అమాయకమైన మాటలకు నేను ఫిదా అయ్యాను అంటూ రన్బీర్ చెప్పుకొచ్చారు. ఇక కిషోర్ కుమార్ ఎవరంటే రణ్బీర్ కపూర్ తండ్రి రిషి కపూర్ కంటే ముందే ఇండస్ట్రీని ఏలిన స్టార్ నటులలో కిషోర్ కుమార్ ఒకరు. (Alia Bhatt)

Also Read: Allu Arjun: అల్లు అర్జున్ ‘పుష్ప 2’ సినిమాపై ఎమోషనల్ పోస్ట్!!

అలాంటి దిగ్గజ హీరో మీకు తెలియదా అని ఈ విషయం విన్న నెటిజన్లు ఆలియా ఫై ట్రోలింగ్ చేస్తున్నారు. అయితే అందరి ముందే రణ్బీర్ కపూర్ తన భార్య పరువు తీసారని కొంతమంది అంటున్నారు. అయితే పబ్లిక్ గా రన్బీర్ ఆలియా పరువు తీయడానికి ఓ కారణం ఉందట.అదేంటంటే అలియా భట్ లిప్ స్టిక్ వేసుకోవడం రణ్బీర్ కపూర్ కి నచ్చదట.

 Ranbir took revenge on Alia Bhatt

అయితే ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో అలియా భట్ చెప్పగా రణ్బీర్ కపూర్ పై చాలామంది ట్రోలింగ్ చేశారు. అయితే తన భార్య కావాలనే తనని ట్రోల్ చేసింది అని అపార్థం చేసుకున్న రన్బీర్ తన భార్యని కూడా ట్రోలింగ్ చేయాలి అనే ఉద్దేశంతో స్టేజ్ పై కిషోర్ కుమార్ ఎవరో తెలియదని అలియా భట్ చెప్పిందనే విషయం చెప్పి అలియా భట్ ని ట్రోల్ చేసేలా రన్బీర్ కపూర్ ప్రతీకారం తీర్చుకున్నారని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.(Alia Bhatt)

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *